చిల్డ్ బీర్ అంటే మందుబాబులకు అదోమాదిరి ఇష్టం ఉంటుంది. ఇతర డ్రింక్స్ తో పోల్చుకుంటే బీర్ తాగటం ఆరోగ్యానికే మంచిదే..కాకకపోతే పరిమితి దాటకూడదు. కానీ బొద్దింకలతో బీర్ అంటే మీరు తాగుతారా..అసలు చూడరేమో కదా..కానీ అక్కడ బొద్దింకలతోనే బీర్ చేస్తారట. అవును జపాన్‌లో బొద్దింకలతో బీర్ తయారుచేస్తున్నారు. ఇక్కడ బొద్దింక అంటే మన ఇళ్లలో తిరిగే బొద్దింక కావండోయ్… జపాన్‌లో ఉండే బొద్దింకలు. అవి చూడటానికి బొద్దింకలలాగా ఉంటాయి కానీ… నిజానికి బొద్దింకలు కావట. అది మ్యాటర్.. అవో రకం కీటకాలు. వాటి ద్వారా బీర్ తయారుచేస్తున్నారట.. దాన్ని కొంచు సౌర్ అని వాళ్లు పిలుస్తున్నారు. ఇది కూల్ డ్రింక్ లాగా గటగటా తాగేయొచ్చు.
అయితేమాత్రం పురుగులతో బీరా..!
పురుగులతో బీర్ ఎందుకు చేస్తున్నారా..అవసరమా ఇలాంటివనేగా మీ ప్రశ్న. చైనా, జపాన్, హాంకాంగ్ లాంటి తూర్పు, ఆగ్నేయ ఆసియా దేశాల్లో పురుగులపైనే ఆహార ప్రయోగాలు చేస్తారు. పురుగులతోనే కొత్త వెరైటీలు వండుతారు. మనకు చైనావంటకాల గురించి మనం చెప్పుకోనక్కర్లా..వాళ్లు ఆహార అభిరుచులు మనకు ఆశ్యర్యకరంగానూ..ఆగ్రహంగానూ అనిపిస్తాయి. అక్కడి వారికి అవేమీ కొత్తవి కావు. వాళ్లు తరచూ పురుగుల్ని ఫ్రై చేసుకొని పకోడీలా తింటారు. కరకరలాడే తేళ్లను రొయ్యలు తిన్నట్టుగా లాగించేస్తుంటారు. కాబట్టి వారికి ఇదో కామన్ విషయం.
ఇవి మామూలు పురుగులు కావు..
ఈ బీర్ తయారీ పురుగులకు సంబంధించిన షాకింగ్ విషయం ఒకటుంది. బీర్ బాటిల్‌పై ఉన్న పురుగును ఇండియన్ టాయ్ బైటర్ అంటారు. ఇవి నీటిలో జీవించే పురుగులు. ఇవి మనుషుల కాళ్ల వేళ్లను కొరికి తింటాయట.. లేదంటే ఇతర కీటకాలు, పురుగులు, చేపలు, చిన్న చిన్న జీవుల్ని తింటాయి. ఈ కీటకాలు 4 అంగుళాల దాకా పెరుగుతాయి. అంటే బొద్దింకల కంటే డబుల్ సైజులో ఉంటాయి. ఇలాంటి వాటితో బీర్ తయారుచేయడమేంటో.
లైట్ తో ఎరవేస్తారు
ఈ పురుగుల్ని సేకరించడానికి జపాన్‌తోపాటూ తూర్పు, దక్షిణాసియా దేశాల ప్రజలు ప్రత్యేక లైట్లను ఉపయోగిస్తారట. ఆ లైట్లను చూసి ఈ కీటకాలు దగ్గరకు వస్తాయి. అలా రాగానే పట్టుకుంటారు. భారీ సంఖ్యలో వీటిని సేకరిస్తారు.
కీటక సువాసనే కీలకం:
జపాన్ బీర్ తయారీలో ఆ మగ పురుగుల నుంచి వచ్చే ఒక రకమైన సువాసనను సేకరించి దాన్ని బీర్ లోకి చేర్చుతున్నట్లు తయారీ కంపెనీ తెలిపింది. అదే ఆ బీరులో ప్రధాన ఎసెన్స్ అని చెప్పుకొచ్చింది. ఆ బీర్ బాటిల్ ధర ఒక్కోటీ 638 యెన్లు (రూ.426). మన దగ్గరే బెటర్ అనుకుంటున్నారు కదా!
టెస్ట్ లో యాపిల్ ను మించిపోతుంది..
ఈ బీర్ తాగితే యాపిల్ లేదా పియర్స్ పండ్ల జ్యూస్ తాగినట్లు ఉంటుందని ఆ కంపెనీ తెలిపింది. తియ్యగా, పుల్లగా ఉంటుందట. మీరు కానీ ఆ దేశాలకు వెళ్లినప్పుడు తినే వాటిని తాగేవాటని దేంతో తయారుచేశారో అడిగి తాగండి. బీర్ కదా అని ఆశపడి తాగేరు. వాళ్లు తినేవి, తాగేవి మనవాళ్లకు అలవాటు లేకపోవటంతో ఆరోగ్యసమస్యలు వచ్చినారావొచ్చు.