మోర్బీ కేబుల్ బ్రిడ్జి ఘటనపై హైకోర్టు సుమోటో విచారణ.. సర్కార్​కు నోటీసులు

-

గుజరాత్​లో అక్టోబర్ 30న బ్రిటిష్ కాలం నాటి వేలాడే మోర్బీ కేబుల్ బ్రిడ్జి కూలిపోయి 135 మంది మరణించిన ఘటనపై ఆ రాష్ట్ర హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి, స్థానిక అధికారులకు నోటీసులు జారీ చేసింది. నవంబర్ 14 లోపు ఈ విషయంపై స్థితి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

చీఫ్ జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ అశుతోష్ శాస్త్రితో కూడిన డివిజన్ బెంచ్ ఈ నోటీసులను ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర హోం శాఖ, మున్సిపాలిటీల కమిషనర్, మోర్బీ మున్సిపాలిటీ, జిల్లా కలెక్టర్​కు జారీ చేసింది. వచ్చే సోమవారం నాటికి ప్రధాన కార్యదర్శి, హోం సెక్రటరీ నివేదిక సమర్పించాలని సూచించింది. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా నవంబర్ 14 లోపు ఈ విషయంపై నివేదికను దాఖలు చేయాలని ఆదేశించింది.

ఈ బ్రిడ్జి కూలిన ఘటనలో ఇప్పటికే 135 మంది మరణించిన సంగతి తెలిసిందే. గల్లంతైన మరో 100కిపైగా మంది ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. ప్రభుత్వ వైఫల్యం.. మరమ్మతులు చేసిన కంపెనీ అలసత్వం.. సందర్శకుల నిర్లక్ష్యం ఈ ఘనటకు కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు.

Read more RELATED
Recommended to you

Latest news