బిజినెస్ ఐడియా: గులాబీల సాగుతో చక్కటి ఆదాయం..!

-

గులాబీలకు మార్కెట్లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. పైగా వీటిని పెంచడం కూడా సులభం. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం గులాబీ సాగు తో వస్తుంది. అయితే గులాబీల సాగు గురించి ఇప్పుడు కొంచెం ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. వీటిని కనుక ఫాలో అయితే ఖచ్చితంగా మంచి రాబడి వస్తుంది. సాధారణంగా గులాబీ మొక్కలు భూమి నుండి ఆరు అడుగుల ఎత్తులో ఉంటాయి. అయితే మీరు రకరకాల గులాబీలు వివిధ రకాల రంగుల గులాబీలను నాటితే మరింత లాభం వస్తుంది.

గులాబీలని పెంచడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. కానీ ఈ గ్రీన్ హౌస్ లో గులాబీల పెంపకం చేపడితే బాగుంటుంది. గులాబీలు బాగా పెరగాలంటే సూర్యకాంతి పుష్కలంగా ఉండాలి. అలాగే వర్షం కానీ బలమైన గాలులు కానీ లేకుండా ఉన్న ప్రదేశం చూసుకుంటే మంచిది. అలాగే మీరు గులాబీ సాగు కోసం మెరుగైన రకాలని ఎంచుకోండి. రకరకాల గులాబీలు నాటితే బాగుంటుంది.

ఎక్కువగా ఉత్తర భారతదేశంలో మైదాన ప్రాంతంలో పూస అరుణ్ ని నాటుతారు. ఇది ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. చలికాలంలో 20 నుండి 25 గులాబి పూలను ఇది ఇస్తుంది. వేసవిలో అయితే 40 పూల వరకు పూస్తాయి. ఏదైనా బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి గులాబీ బిజినెస్ బాగుంటుంది. చక్కగా పూలను సాగు చేసి మార్కెట్లో అమ్మితే మంచిగా లాభాలు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news