ఖేలో ఇండియా పోటీలకు గుల్మర్గ్ ఆతిథ్యం ఇస్తోంది : ప్రధాని మోడీ

-

ఖేలో ఇండియా పోటీలకు గుల్మర్గ్ ఆతిథ్యం ఇస్తోందని  ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. కశ్మీర్ లో జడ్-మోడ్ టన్నెల్ సొరంగాన్ని  ప్రారంభించారు. అనంతరం టన్నెల్ లోపలికి వెళ్లి పరిశీలించారు.  ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడారు. బీజేపీ హయాంలో టన్నెల్ పూర్తి కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై సోన్ మార్గ్ ప్రాంతంలో రూ.2700 కోట్లతో దీనిని నిర్మించారు. కొండ చరియలు, మంచు కారణంగా రాకపోకలకు సమస్యగా మారడంతో ఇక్కడ టన్నెల్ ప్రాజెక్ట్ చేపట్టారు. ఇది సముద్ర మట్టానికి 8,650 అడుగుల ఎత్తులో ఉంది. 6.5 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ సొరంగంతో ఏడాదిలో ఏ సీజన్ లోనైనా లడ్డాఖ్ ను రహదారి మార్గం ద్వారా చేరుకోవడానికి వీలు అవుతుంది. 2015లో ప్రారంభం అయిన నిర్మాణ పనులు గత ఏడాది పూర్తయ్యాయి. దీంతో సోన్ మార్గ్ కు పర్యటకుల రాక కూడా పెరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news