గుప్పెడంతమనసు ఎపిసోడ్ 337: వసూ కోసం రిషీ- గౌతమ్ ల టామ్ అండ్ జెర్రీ ఫైట్..ఒకరికి తెలియకుండా ఒకరు రెస్టారెంట్ కి ఎంట్రీ

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో మహేంద్ర ఒక గ్రౌండ్ లో నుల్చోని.. జరిగింది అంతా తలుచుకుంటాడు. ఇంతలో అక్కడకు వచ్చిన రిషి మీరేంటి ఇక్కడ అంటే..ఒక ప్రశ్నకు సమాధానం వెతుకుంటూ వచ్చాను అంటాడు మహేంద్ర. ఏం ప్రశ్న అని రిషీ అంటే..నీకు అర్థంకాదులే అంటాడు. చెప్తాను అడగండి డాడ్ అంటాడు రిషీ.. నలుగురు నడిచే దారిలో అరటితొక్క వేసేవారిని ఏమంటారని అడుగుతాడు మహేంద్ర… బుర్ర తక్కువ అంటారని చెబుతాడు రిషి. సంబంధం లేకున్న పక్కవిషయాల్లో జోక్యం చేసుకుని వాళ్ల ప్రశాంతతను చెడగొట్టేవారిని ఏం అంటారు అంటే..పనికిమాలిన అంటాడు రిషీ. ఇవన్నీ ఎందుకు డాడ్ అంటే..ఒకరు ఒకర్ని దూరం చేయాలని ప్రయత్నించారు, ఆ ఒకరు ఎవరో తెలిస్తే అని మహేంద్ర అంటే..రిషీ వసుధార గురించా అంటాడు. మొన్న టైమ్ కి నువ్వొచ్చావు కాబట్టి సరిపోయింది లేదంటే ఎంత ఘోరం జరిగిపోయేది..అనవసరంగా జగతి-వసుధార విడిపోయేవారు అంటాడు. విడిపోలేదు కదా అంటాడు రిషి. ఒకవేళ విడిపోకపోయినా వాళ్ల మధ్య ఎవరో ఏదో చేశారు, వాళ్లు ఎవరో నాకు తెలియాలి అంటాడు మహేంద్ర..డాడ్ ఆ విషయం వదిలేయండి అంటాడు. వదిలేయను … నాకు తిట్లు రావు కానీ బాగా తిట్టాలని ఉంది..అయినా వాళ్లు విడిపోతే ఏమొస్తుంది అంటాడు మహేంద్ర. రిషీ పదండి డాడ్ వాళ్లిద్దరు బానే ఉన్నారుకదా అంటాడు. కానీ వదలను రిషి అని హెచ్చరిస్తాడు మహేంద్ర. రిషీ ఈ టాపిక్ ఇంతటితో వదిలేయండి అంటాడు. ఎవరి కారు వాళ్లు ఎక్కుతారు. డాడ్ కి నాపేరు మేడం చెప్పకపోవడం మంచిదైంది అనుకుంటాడు రిషి.

జగతి ఇంట్లో

పొద్దున్నే తలుపుకొడతారు. తలుపుతీసిన జగతి ఇంటికి వచ్చిన గౌతమ్ ని చూసి షాక్ అవుతుంది. మీరు కొంచెం పక్కకు జరిగితే నేను లోపలికి వెళ్తాను అంటాడు. లోపలికి వెళ్లి వసుధార లేదా అంటే..మేం ఇప్పుడు కాలేజీకి బయలుదేరే టైం కదా అంటుంది. వ్రాంగ్ టైంలో వచ్చాను ఇన్ డైరెక్ట గా వార్నింగ్ ఇస్తున్నారా ఏంటి అనుకుని.. మీ టైం డిస్టబ్ చేయను కానీ మిషన్ ఎడ్యుకేషన్ గురించి అద్భుతమైన ఐడియాలు నాకొచ్చాయి..మీకు ఉపయోగపడతాయని ఈ ప్రింట్స్ తీసుకొచ్చా అంటాడు గౌతమ్. ఇంతలో వసుధార వస్తుంది. జగతి ప్రాజెక్టు గురించి ఓపిగ్గా టైప్ చేసి, ప్రింట్ తీసి తీసుకొచ్చాడు.. మెయిల్ కూడా చేయొచ్చని మరిచిపోయినట్టున్నారు పాపం అంటూ సెటైర్ వేస్తుంది జగతి. వసూతో ఆ పేపర్స్ ఇస్తారు తీసుకో ఇప్పుడు వాటి గురించి డిస్కస్ చేసే టైం లేదు మనం కాలేజీకి వెళదాం అంటుంది జగతి. ఆ మాటలు విన్న గౌతమ్.. తనని ఇన్ డైరెక్ట్ గా వెళ్లిపోమని చెబుతోందా అనుకుంటాడు మనసులో. వసూకి ఆ పేపర్స్ ఇస్తాడు. తను చూస్తుంటే.. ఇంతలో వసుతో సెల్ఫీ తీసుకుని ఓ పెద్ద పనైపోయింది వసుధారం అంటాడు. ఏం పని అని వసూ అంటే..ఇక్కడికి వచ్చినీకు పేపర్స్ ఇచ్చాను కదా..హ్యాపీ అంటాడు.

రిషి ఇంట్లో

అందరూ కూర్చుని టిఫిన్ తింటుంటారు. గౌతమ్ కనిపించడం లేదేంటని రిషీ అడిగితే.. వసుధార వాళ్ల ఇంటికి వెళ్లాడని చెబుతుంది ధరణి. వసుధారకి అభిమానిగా మారిపోయాడేమో అంటుంది దేవయాని.. అవును దేవయాని.. వసుధార తెలివితేటలకి ఎవరైనా అభిమానిగా మారక తప్పదు అంటాడు ఫణీంద్ర. రిషీ తినకుండా వెళ్లిపోతాడు.

జగతి-వసుధార కారుల్లో వెళుతుంటారు. ప్రతి రోజూ కారు అలవాటైందా అని వసుని అన్నమాటలు జగతి… నేను వెళ్లమంటే వెళ్లిపోతావా అన్న జగతి మాటలు వసు గుర్తుచేసుకుంటుంది వసూ.మేడమ్ ఒక మాట అడగనా అని వసూ.. ఎదుటి వారిని అర్థంచేసుకోవడంలో మనం ఎందుకు పొరపాట్లు చేస్తుంటాం అంటుంది. జగతి మనం మన దృష్టికోణం నుంచి కాకుండా..ఎదుటి వారి పాయంట్ ఆఫ్ వ్యూలో ఆలోచించగలిగితే చాలా అపార్థాలు తొలగిపోతాయి అంటుంది జగతి. ఇంతలో వసుకి రిషీ కాల్ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేయగానే.. వసుధారా ఎక్కడున్నావ్, ఎవరితో ఉన్నావ్, ఏం చేస్తున్నావ్, పొద్దున్నే గౌతమ్ ఎందుకొచ్చాడని అడుగుతాడు, ఇంటికి రావడానికి వాడికేం పని అంటాడు. ఇప్పుడెక్కడున్నావ్ అంటే కాలేజీకి వెళుతున్నా అని చెబుతుంది..సరే కాలేజీలో కలుద్దాం అనేసి కాల్ కట్ చేస్తాడు రిషి. అక్కడకు వచ్చిన మహేంద్రని చూసి షాక్ అయిన రిషి…. డాడ్ గౌతమ్ ఏంటి డాడ్..ఇలా చేస్తున్నాడు అంటాడు. మహేంద్ర ఎలా చేస్తున్నాడు అంటే..రిషీ ఆ గౌతమ్ ఇంత పొద్దున్నే అక్కడి వెళ్లాడు…వసుధార దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఏంటని అడుగుతాడు. మీరైనా వాడికి అర్థమయ్యేలా చెప్పండి అంటే.. గౌతమ్ నీ ఫ్రెండ్ కదా అదేదో నువ్వే చెబితే బావుంటుంది అంటాడు మహేంద్ర.నా అభిప్రాయం మాత్రమే, కాదుకూడదు అంటావా నేనే చెప్తాను అంటాడు మహేంద్ర. సరే నేను చెప్పుకుంటానులే అని వెళ్తాడు. గౌతమ్..వసు ఇంటికి వెళితే కోపం వస్తుంది..కానీ ఎందుకు కోపం వస్తుందో భయటపడవు అని అనుకుంటాడు మహేంద్ర.

కాలేజీలో

జగతి- మహేంద్ర నడుచుకుంటూ వస్తారు. మహేంద్ర.. జీవితం విచిత్రమైనది కదా ఎప్పుడేమవుతుందో తెలియదు అంటుూ.. రిషి రావడం చూసి ఆపేస్తాడు. జగతి చెప్పండి మహేంద్ర సార్, జీవితం గురించి ఏదో జ్ఞానభోదన చేస్తన్నారుగా అంటే..మన పుత్రరత్నం వస్తున్నాడు.. వాడి మూడ్ బాగోపోతే నాకు జ్ఞానబోధ చేస్తాడని అక్కడి నుంచి మహేంద్ర వెళ్లిపోతాడు. ఇంతలో అక్కడకు వచ్చిన రిషికి జగతి గుడ్ మార్నింగ్ చెప్తుంది. థ్యాంక్యూ మేడమ్ అంటాడు రిషీ. మీరు చెప్పిన పని నేను చేయలేకపోయాను కదా అంటే అందుకే థ్యాంక్స్ అంటాడు. వసుధార గురించి నాకన్నా మీకే ఎక్కువ తెలుసు అలాంటప్పుడు అలా ఎలా పంపించేయాలనుకుంటారు మేడమ్, సార్ వసుధారను అలా పంపిస్తే ఫీల్ అవుతుందని చెప్పాలికదా మేడమ్ అంటాడు. జగతి మీరు చెప్పాక ఎలా కాదాంటాను సార్ అంటే.. మీ స్టూడెంట్ పై మీకు ఆమాత్రం బాధ్యత లేదా అని రివర్సవుతాడు రిషి. మేడం గౌతమ్ నా ఫ్రెండ్ అయినా వాడివల్ల మీ టైమ్ డిస్టర్ అవకుండా చూసుకోండనేసి వెళ్లిపోతాడు. నీ మనసు ఒకటి చెబుతోండి-నీ పెదాలు మరొకటి అంటాయ్ నిన్ను అర్థం చేసుకోవడం కష్టం అనుకుంటుంది జగతి. రిషి మనసేంటో నీకైనా అర్థమవ్వాలి వసుధార అనుకుంటుంది జగతి.

పుష్ప- వసూ కబుర్లు చెప్పుకుంటూ నడుచుకుంటూ వస్తుంటారు. జేబులోంచి ఫోన్ తీస్తుండగా కార్ కీ పడిపోయినా చూసుకోకుండా రిషి వెళ్లిపోతాడు. అది తీసేందుకు వెళ్లేలోగా అటుగా నడిచే స్టూడెంట్స్ కాలితో ఎక్కడికో తోసేస్తారు. ఇంతలో బెల్ మోగుతుంది. పుష్ప వసూకి చెప్తుంది. క్లాస్ టైం అయిపోతుంది.. ఇవన్నీ ఎందుకు లేనిపోని తలనొప్పులు నెత్తికెక్కించుకుంటావ్ అని పుష్ప అంటే.. అది వెతికి తీసుకొస్తా అంటుంది వసుధార…సార్ కూడా వెళ్లారు అని.. పుష్ప..వుసుని లాక్కెళ్లిపోతుంది. ఎపిసోడ్ ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్ లో

రెస్టారెంట్లో కూర్చున్న రిషిని చూసి కాఫీ కావాలా అని అడుగుతుంది వసుధార. కాఫీ కోసమే కదా ఇక్కడకు వస్తా అంటాడు రిషీ. రిషీ టెబుల్ వెనకే కుర్చున్న గౌతమ్ రిషీను చూసుకోకుండా హలో వసుధార అని పిలుస్తాడు. గౌతమ్- రిషి ఒకర్నొకరు చూసి షాక్ అవుతారు. నువ్వెందుకు ఇక్కడకు వచ్చావంటే నువ్వెందుకు వచ్చావ్ అని వాదించుకుంటారు. ప్రతిసారి నీకు ఇక్కడ ఏం పనిరా నేనెప్పుడు వచ్చినా ఇక్కడే ఉంటున్నావ్ అని రిషీ అంటే..నేను వచ్చిన ప్రతిసారి నువ్వు కూడా వస్తున్నావ్ కదా అని గౌతమ్ అంటాడు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news