కేసీఆర్‌ సర్కార్‌ ను కూల్చేయండి : వైఎస్‌ షర్మిల సంచలనం

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు పై మరోసారి తెలంగాణ వైసీపీ పార్టీ అధినేత వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. దున్న పోతుపై వాన పడ్డట్లే.. సీఎం కేసీఆర్‌ లో ఎలాంటి చలనం లేదంటూ నిప్పులు చెరిగారు వైఎస్‌ షర్మిల. ఈ రోజు ఉద్యోగాలు లేక, నోటిఫికేషన్స్ రాక నిప్పంటించుకుని ఆత్మహత్యలు చేసుకుంటుంటే దున్నపోతు మీద వాన పడ్డట్లు కేసీఆర్ గారిలో మాత్రం చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒకవైపు నిరుద్యోగులు, మరోవైపు రైతుల చావులతో రాష్ట్రం ఆత్మహత్యల తెలంగాణగా మారితే దొర గారు మాత్రం ఉద్యోగాలు ఇవ్వకుండా రైతులను ఆదుకోకుండా అధికారముందనే అహంకారంతో తమాషా చూస్తున్నాడని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. నిరుద్యోగుల హంతకుడు… రైతుల హంతకుడు…ఉద్యోగుల చావులకు కారకుడు కేసీఆర్ గారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు ఇవ్వని, రైతుల చావులను ఆపని, ఉద్యోగుల చావులకు కారణమయ్యే అహంకార పాలన మనకొద్దని… కేసీఆర్ అధికారాన్ని కూల్చేస్తేనే రాష్ట్రంలో చావులు ఆగిపోతాయని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news