బ్రేకింగ్ : ఈటల రాజేందర్ అరెస్ట్ !

-

హుజురాబాద్ ఎమ్మెల్యే,బీజేపీ నేత ఈటల రాజేందర్ హౌస్ అరెస్ట్ అయ్యారు. షామీర్పేటలోని నివాసం నుంచి ఈటల రాజేందర్‌ బయటకు వెళ్లకూడదని పోలీసులు హౌస్ అరెస్ట్‌ చేశారు. దీంతో ఆయన ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక తనను హౌస్ అరెస్ట్‌ చేయడంపై ఈటల హాట్‌ కామెంట్స్ చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వం ఆరిపోయే దీపమని.. పోలీసులు అధికార పక్షం కొమ్ము కాస్తున్నారని నిప్పులు చెరిగారు. ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని… బండి సంజయ్ అరెస్ట్ చేసిన తీరు ప్రభుత్వ క్రూరత్వానికి నిదర్శనమని ఈటల మండిపడ్డారు.

కరోనా నెపం పెట్టి ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని.. అణచివేసే ప్రయత్నం యదేచ్చగా కొనసాగుతుందన్నారు. ఇక్కడ ఉన్న చట్టం, ఇక్కడున్న పోలీస్ అధికార పార్టీ వారికి కొమ్ము కాస్తూ వారికి మాత్రమే రక్షణ ఇస్తూ.. వారి కార్యక్రమాలను కొనసాగిస్తూ.. ప్రజల కోసం పని చేసే పార్టీలను మాత్రం గొంతు నొక్కే ప్రయత్నం చేయటం దారుణమని నిప్పులు చెరిగారు. నల్లగొండలో ముఖ్యమంత్రి పర్యటన సమయంలో, కేటీఆర్ గారి పర్యటన సమయంలో వందలు వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు, అప్పుడు లేని నిభందనలు ఇప్పుడు ప్రతిపక్షాలకు మాత్రం ఎలా వర్తిస్తాయి? అని నిలదీశారు ఈటల రాజేందర్‌.

Read more RELATED
Recommended to you

Latest news