ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం అటు ప్రజలలో కానీ సెలబ్రిటీ లో కానీ బాగానే చూపుతోందని చెప్పవచ్చు. ఇక అందులో ప్రతి ఒక్క విషయాన్ని కూడా షేర్ చేస్తూ చాలా సంబరపడిపోతూ ఉంటారు. అయితే నిజానికి సోషల్ మీడియా ఎంతగా కాలక్షేపాన్ని అందిస్తుందో కొన్నిసార్లు చిక్కుల్లో కూడా పడేసేలా చేస్తూ ఉంటుంది. కొంతమంది హ్యాకర్లు సోషల్ మీడియాను హ్యాక్ చేయడం వల్ల తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తవానికి సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ అవడం అనేది కొత్తేమీ కాదు ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీస్ రాజకీయ నాయకుల సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇలా ఎన్నోసార్లు ఇబ్బంది పడే వారు కూడా ఉన్నారు.
ఇప్పుడు తాజాగా బుల్లితెర యాంకర్ హీరోయిన్ విష్ణు ప్రియ ఫేస్ బుక్ హ్యాక్ కావడంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. బుల్లితెరపై హాట్ యాంకర్ గా గుర్తింపు పొందిన విష్ణు ప్రియ ఎప్పుడూ కూడా హాట్ ఫోసులతో వీడియోలతో కుర్రకారులను సైతం నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది. మొదటిసారిగా పోవే పోరా వంటితో తన మాటలతో గ్లామర్ తో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ షో తర్వాత కొన్ని సినిమాలలో మాత్రమే నటిస్తూ ఉన్నది.
ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎప్పుడు అభిమానులకు టచ్ లోనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈమధ్య ఒక ప్రైవేట్ సాంగ్ లో కూడా చేసి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే విష్ణు ప్రియ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ నిన్న రాత్రి జరిగినట్లుగా సమాచారం. అంతేకాకుండా అందులో నుంచి కోన్ని నగ్న ఫోటో లు రావడంతో తన ఫేస్ బుక్ హ్యాక్ అయినట్లుగా గుర్తించింది. ఇక ఈ విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ వేదికగా తన ఫాలోవర్స్ కి తెలియజేసింది ఈమె. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.
View this post on Instagram