దీపావళి పండుగ సందర్భంగా ఎన్నో సినిమాలు పోటీ పడుతున్నాయి. మంచు విష్ణు హీరోగా నటించిన జిన్నా,విశ్వక్ సేన్ హీరోగా, వెంకటేష్ కీలక పాత్రలో తెరకెక్కిన ఓరి దేవుడా మరియు తమిళ డబ్బింగ్ సినిమాలు సర్దార్ అండ్ ప్రిన్స్ కూడా విడుదల కానున్నాయి. ఇవన్నీ కూడా మంచి అంచనాల కలిగి ఉన్నాయి. సాధారణంగా పోటీ అంటే కొత్త సినిమాలు కాబట్టి వీటి మధ్యనే వుండాలి. విచిత్రం గా వీటికి ఒక డబ్బింగ్ సినిమా సవాలు విసురుతోంది.
ఆ సినిమా నే కన్నడ నుంచి డబ్ అయ్యి భారీ హిట్ అయ్యిన“కాంతారా”. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో, ఆయనే హీరో గా వచ్చిన ఈ చిత్రం మొదట కన్నడ లో సంచలన విజయం నమోదు చెయ్యగా, ప్రస్తుతం తెలుగు సహా ఇతర భాషల్లో కూడా రిలీజ్ అయ్యి మంచి వసూళ్లు సాధిస్తోంది. ముఖ్యంగా మన తెలుగులో అయితే ఎవరూ ఊహించని విధంగా వసూళ్లు సాధిస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమా తెలుగు లో 20 కోట్ల రూపాయలు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఆయినా కాని ఈ సినిమా ఇప్పుడే నెమ్మదించే అవకాశం లేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇంకో వారం 10 రోజుల వరకు ఈ సినిమా హవా వుండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.దీంతో దీపావళి పండుగకు వచ్చే సినిమాల మేకర్స్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా వల్ల తమ సినిమా వసూళ్లు తగ్గి పోయే అవకాశం ఉందని భయపడి పోతున్నారట.