గోవా బీచ్‌లో అర్ధనగ్నంగా మహిళ మృతదేహం

గోవా బీచ్ లో అర్ధ నగ్నంగా ఉన్న ఓ యువతి మృతదేహం కలకలం రేపింది. సముద్రపు నీటిలో మునిగి ఆమె మరణించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదవశాత్తు నీటిలో పడి చని పోయి ఉంటుందని భావిస్తున్నారు పోలీసులు. అయితే ఈ ఘటన ఈ నెల 12న జరగగా చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  ఇక కుటుంబ సభ్యుల ఆందోళనతో ఆ మహిళ మృతదేహానికి తాజాగా పోలీసులు పోస్టుమార్టం నిర్వహించారు. అయితే ఈ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.

అర్థ నగ్నంగా దొరికిన ఆ మహిళ మృత దేహం పై ఎలాంటి లైంగిక దాడి జరిగినట్లు ఆనవాళ్లు లేవని పోలీసులు పేర్కొన్నారు. అయితే  ఆమెపై కొందరు దుండగులు లైంగిక దాడికి పాల్పడి హతమార్చి ఉంటారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఘటన గోవాలో కలకలం రేపగా… దీనిపై సీఎం ప్రమోద్ సావంత్ కూడా స్పందించారు. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తును ప్రారంభించి… బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.