చేనేతపై జీఎస్టీ రద్దు డిమాండ్.. మోదీకి లక్షల పోస్టుకార్డులు పంపిన నేతన్నలు

-

చేనేతపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీపై యుద్ధం షురూ చేశారు. కేటీఆర్ కు మద్దతు తెలుపుతూ ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు మోదీకి లేఖలు రాశారు. తాజాగా మంత్రి పిలుపుతో ముందుకొచ్చిన నేతన్నలు మోదీకి రాసిన లక్షలాది ఉత్తరాలను ఇవాళ పీఎంవో కార్యాలయానికి పోస్టు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వచ్చిన లక్షలాది ఉత్తరాల సంచులతో నేతన్నల సంక్షేమ సంఘాలు, చేనేత కార్మిక సంఘాలు, నేతన్నల సామాజిక వర్గాలు, పార్టీ లీడర్లు హైదరాబాద్ లోని నిజాం కాలేజీ గ్రౌండ్ లో తాము రాసిన పోస్టుకార్డులను భారీగా ప్రదర్శించారు. చేనేత కార్మికుల భవిష్యత్తును ఆగమ్యగోచరంగా మార్చిన జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని నేతన్నలు డిమాండ్ చేశారు. నేతన్నల సంక్షేమానికి గతంలో ఉన్న జీవిత బీమా, యార్న్ సబ్సిడీ వంటి కార్యక్రమాలను పునరుద్ధరించాలని కోరారు. రద్దు పరిచిన హ్యాండ్లూమ్, పవర్ లూమ్ వంటి బోర్డులను వెంటనే తిరిగి ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news