ఆ చిరున‌వ్వు సాక్షిగా.. త‌ర‌త‌రాల‌కు నిలిచిన విజ‌య‌చిహ్నం “విజయమ్మ”… !

-

రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కుల ముఖంపై చిరున‌వ్వు చూడ‌డం అంటే.. అంత ఈజీకాదు. ఎప్పుడూ ఏదో ఒక స‌మ‌స్య‌, ఎప్పుడూ ఏదో ఒక ప‌నిపై ఉండే రాజ‌కీయ నేత‌ల‌కు న‌వ్వే తీరిక ఎక్క‌డ ఉంటుంది? గ‌తంలో ఎన్టీ ఆర్ కాలం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సీఎంను తీసుకున్నా.. ఒక్క దివంగ‌త వైఎస్ త‌ప్ప మిగిలిన వా రు సీరియ‌స్ రాజ‌కీయాలే చేశారు. వీరిలో వారు వీరు అనే తేడా ఏమీ లేదు. ఎన్టీఆర్ మొద‌లుకుని, చంద్ర ‌బాబు వ‌ర‌కు, మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డి మొద‌లు.. రోశ‌య్య వ‌ర‌కు కూడా ఏ సీఎం కూడా ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి కానీ, ప్ర‌జ‌ల మ‌ధ్య ఉన్న‌ప్పుడు కానీ, పార్టీ ప‌రంగా కానీ ఎన్న‌డూ మ‌న‌సార న‌వ్విన‌ట్టు మ‌న‌కు క‌నిపించ‌దు.

కానీ, వైఎస్‌ను తీసుకుంటే.. ఆయ‌న‌కు కూడా పాల‌నా ప‌రంగా అనేక చింత‌లు ఉన్నాయి. ప్ర‌భుత్వ ప‌రం గా అనేక ఇబ్బందులు కూడా ఉన్నాయి. అయితే, ఏనాడూ కూడా ఆయ‌న త‌న పెద‌వుల‌పై చిరున‌వ్వును చెర‌గ ‌నివ్వ‌లేదు. ఎంత బాధ వ‌చ్చినా.. ఎంత‌టి స‌మ‌స్య ఎదురైనా కూడా.. ఆయ‌న త‌నదైన చిరున‌వ్వుతో నే వాటి ని ప‌రిష్క‌రించారు. స‌మ‌స్య‌ల‌కు సాధ‌న చేసి చూపించారు. ఆయ‌న త‌ర్వాత రాజ‌కీయాల్లోకి వ‌చ్చి న ఆయ‌న స‌తీమ‌ని విజ‌య‌మ్మ సైతం ఇదే పంధాను అల‌వ‌రుచుకున్నారు. చెర‌గ‌ని చిరున‌వ్వుతోనే అంద‌రినీ ప‌ల‌క‌రించేవారు. ఒకానొక సంద‌ర్భంలో జ‌గ‌న్‌ను సీబీఐ అధికారులు అరెస్టు చేసిన‌ప్పుడు త‌ప్ప త‌ర్వాత ఎప్పుడూ విజ‌య‌మ్మ విల‌పించిన సంద‌ర్భం మ‌న‌కు క‌నిపించ‌లేదు.

ఏ కార‌ణంతో ఎవ‌రు వైఎస్ ఇంటి గ‌డ‌పతొక్కినా.. చిరున‌వ్వుతో ముందుగా ప‌ల‌క‌రించేది విజ‌య‌మ్మే! ఏ మో ఎంత దూరం నుంచి వ‌చ్చారో అనుకుని ఆమె ఇంటికి వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రికీ పేరు పేరునా వండి వ‌డ్డించేవారు. మీ రాజ‌కీయాలు మీ ఇష్టం.. ఇప్పుడు మీరు మా ఇంటికి వ‌చ్చారు. అంటే.. నాకు తోబుట్టు వుతో స‌మానం.! అంటూ.. వ‌చ్చిన వారికి ఇష్టంగా అన్నం పెట్టే వారు. ఈ ఉదార‌తే వైఎస్ కుటుంబాన్ని శిఖ‌రాగ్రాన నిల‌బెట్టింది. ఈ ఆత్మీయ భావ‌నే విజ‌య‌మ్మ‌ను త‌ర‌త‌రాలు గుర్తుంచుకునేలా చేసింది. ఆమె చిరునవ్వులో పెద్దాయన్ని చూసుకుంటున్నామనే వైఎస్‌ అభిమానులు..  అప్ప‌టికీ ఇప్ప‌టికీ.. మ‌నుషులు మారారేమో.. రాష్ట్రంలో పార్టీలు మార‌యేమో.. కానీ, విజ‌య‌మ్మ మాత్రం మార‌లేదు. ఆమె ముఖంపై చిరున‌వ్వు తొణ‌క‌లేదు.. ఆమె చేతుల్లో ఆత్మీయ‌త త‌గ్గ‌లేదు! ద‌టీజ్ విజ‌య‌మ్మ‌!! వైఎస్‌ విజయమ్మకు మనలోకం తరుపున జన్మదిన శుభాకాంక్షలు..

Read more RELATED
Recommended to you

Latest news