ఆ టీడీపీ సీనియ‌ర్‌కు క‌రోనా వేళ ఈ కుళ్లు రాజ‌కీయం ఏంటో..?

-

ఏ పార్టీ అయినా, ఏ నాయ‌కుడు అయినా.. రాజ‌కీయాలు చేయాల్సిందే. దీనికి సంబంధించి ఎవ‌రికీ ఎలాంటి అభ్యంత‌రం కూడా ఉండదు. కానీ, స‌మ‌యం కాని స‌మ‌యంలో రాజ‌కీయాలు చేయ‌డం, విమ‌ర్శ‌లు సంధిం చ‌డం అనేది ఎవ‌రికీ మంచిది కాదు. ఏ కొత్త నేతో వెంగ‌ళ‌ప్ప మాదిరిగా విమ‌ర్శ‌లు చేస్తే.. సీనియ‌ర్లు స‌ర్దిచె ప్పాలి. కానీ, సీనియ‌ర్లే.. వెంగ‌ళ‌ప్ప‌ల‌ను మించిపోతే..?! ఇప్పుడు ఏపీలో అదే జ‌రుగుతోంది. టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ స్పీక‌ర్‌, మాజీ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై తాజాగా మ‌రోసారి ధ్వ‌జ మెత్తారు.

అస‌లు జ‌నాలు క‌రోనా బారిన ప‌డి ఛ‌స్తుంటే.. ఆయ‌న మానాన ఆయ‌న జ‌గ‌న్ ప్ర‌భుత్వం వేస్ట్‌.. దీనికి పాలించ‌డం రాదంటూ.. వ్యాఖ్య‌లు సంధించారు. కరోనా ముసుగులో గత ఏడాది తమ వైఫల్యాలు కప్పి పుచ్చుకునేందుకు జగన్‌, వైసీపీ ప్రయత్నాలు చేస్తోందని యనమల రామకృష్ణుడు ఆరోపించారు. గత ఏడాది రాబడులు తగ్గడానికి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలే కారణం తప్ప… కరోనా వల్ల కాదని ముక్తాయిం చారు. రూ.336 కోట్ల మద్యం విక్రయాలు పెరిగాయని ప్రభుత్వమే లెక్కలు చెప్పిందన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి తరలించిన అక్రమ మద్యం విక్రయాలకు లెక్కేలేదన్నారు.

కరోనా పేరుతో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లలో కోత పెట్టారని య‌న‌మ‌ల పాడిందే పాట పాడారు. అలాగే సంక్షేమ పథకాల్లో కోతలు పెట్టారని, అనేక స్కీమ్‌లు రద్దు చేశారన్నారు. గత ఏడాది కేంద్రం నుంచి పుష్కలంగా నిధులు వచ్చాయని చెప్పారు. కరోనా కోసం కేంద్రం అదనంగా నిధులు ఇచ్చింద ని…కేంద్రం ఇచ్చిన నిధులన్నీ దుర్వినియోగం చేశారని విమర్శించారు. జగన్‌ ఇప్పటికీ నాన్‌ సీరియస్‌గా ఉన్నారని క‌స్సుమ‌న్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై రూ.13వేల కోట్ల భారం పడిందని అబద్ధం చెబుతున్నారని యనమల విమర్శలు గుప్పించారు. ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించొచ్చు.. కానీ, ఇప్పుడు ఇది స‌మ‌యం, సంద‌ర్భ‌మా? అనేది మాత్రం చ‌ర్చ‌కు వ‌స్తోంది. అందుకే ఆయ‌న వ్య‌వ‌హార శైలిని ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్పుప‌డుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news