ఇవాళ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.టెస్టు మ్యాచ్ల ఫీజులను భారీగా పెంచుతూ బీసీసీఐ ప్రకటన జారీ చేసింది.ఇక ఈ నిర్ణయాన్ని క్రికెట్ ఫ్యాన్స్ స్వాగతిస్తున్నారు. తాజాగా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ దీనిపై స్పందిస్తూ.. ‘పనికి తగ్గ ప్రతిఫలం లభించనుంది. మంచి నిర్ణయం’ అని ట్వీట్ చేశారు. ఈ నిర్ణయం తీసుకోవడంలో కీలక పాత్ర పోషించిన జై షాని గంభీర్ అభినందించారు. ఇప్పటివరకూ ఆటగాళ్లకు ఒక టెస్టుకు రూ.15 లక్షలు చెల్లిస్తుండగా…ఇకపై రూ.45 లక్షలు ఇవ్వనున్నారు.
ఇదిలా ఉంటే….ధర్మశాల వేదికగా ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఐదో టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 64 రన్స్ తేడాతో ఓటమిపాలైంది.ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ 218 పరుగులు చేయగా ఇండియా 477 పరుగులతో దీటుగా బదులిచ్చింది. 259 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 195 రన్స్ కే కుప్పకూలింది. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐదు వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. దీంతో టెస్టు సిరీస్ భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకుంది. చివరి టెస్టులో ఆధిపత్యం కనబరిచిన ఇండియా కేవలం మూడు రోజుల్లోనే ఆటను ముగించేసింది. దీంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ టేబుల్ లో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది.