టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు కుదిరిన వేళ ఆంధ్ర ప్రదేశ్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత ఎన్నికలకు ముందు ఏపీలో ప్రధాని మోదీ రాకను వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీ…తాజాగా తమ సభకు రావాలని ఆహ్వానించింది. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబు నాయుడు వెల్లడించారు.ఆంధ్ర ప్రదేశ్ లోని పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఈ నెల 17న జరిగే తెలుగుదేశం పార్టీ-జనసేన ఉమ్మడి సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఇందుకు అనువైన ప్రదేశం ఎంపిక చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేతలను ఆదేశించారు. మూడు పార్టీలు కలిసి సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కాగా,టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. త్వరలోనే సీట్ల సర్దుబాటుపై క్లారిటీ రానుంది. జనసేన-బీజేపీకి కలిపి 30 అసెంబ్లీ స్థానాలు, 8 లోక్ సభ స్థానాలు కేటాయించినట్లు తెలుస్తోంది. ఇక టీడీపి 145 MLA స్థానాలు , 17 MP స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు టాక్.