పవన్ కళ్యాణ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ నిధి అగర్వాల్ హీరోయిన్ గా చేస్తోంది. కాగా, ఈ సినిమా ఈనెల 12వ తేదీన విడుదల కావాల్సి ఉండగా… ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడింది. హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన సీజీ వర్క్ కాస్త లేట్ అవ్వడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది.

తాజాగా ఈ విషయాన్ని సినిమా నిర్మాత ఏఎం రత్నం ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఈ విషయాన్ని షేర్ చేసుకున్నారు. ఈ విషయం పైన చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ సినిమా రిలీజ్ డేట్ తెలియాల్సింది. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ విషయం తెలిసి కాస్త నిరాశలో ఉన్నారు. చాలా రోజుల నుంచి ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సినిమా విడుదల అవుతుందని సంబరాలు చేసుకునే లోపే ఈ విషయం తెలిసి కాస్త డీలా పడ్డారు.