పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..”హరిహర వీరమల్లు”నుంచి బిగ్ అప్డేట్

-

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే ఆయన నటిస్తున్న తొలి పాన్ ఇండియా ఫిల్మ్ ‘హరి హర వీరమల్లు’ అప్ డేట్ కోసం పవన్ అశేష అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఏ.ఎం.రత్నం ప్రొడ్యూస్ చేస్తున్నఈ పిక్చర్ ను క్రిష్ డైరెక్ట్ చేస్తుండగా, ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ ఇస్తున్నారు.

ఇకపోతే ఈ చిత్రం తర్వాత పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ ఫేమ్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ చేయనున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘యథా కాలమ్ తథా వ్యవహారమ్’ పిక్చర్ కూడా చేయనున్నారు.  ఈ సినిమాకు వక్కంతం వంశీ స్టోరి అందిస్తున్నారు.

అయితే.. తాజాగా ‘హరి హర వీరమల్లు’అదిరిపోయే అప్టేట్‌ వచ్చింది. ఈ సినిమా షూటింగ్‌ అక్టోబర్‌ 17 వ తేదీ నుంచి ప్రారంభం కానుందట. అంతేకాదు.. ఈ సినిమాకు కీరవాణీ సంగతం అందించనున్నారు. ఈ విషయాన్ని కీరవాణీనే తన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ మేరకు పవన్‌ కళ్యాణ్‌ తో దిగిన పిక్‌ ను షేర్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news