ఒమిక్రాన్‌ వల్ల ప్రాణభయం లేదు.. : హరీష్ రావు

-

ఒమిక్రాన్‌ వేరియంట్ కేసులు నమోదైన.. నేపథ్యం లో తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన చేశారు. ఒమిక్రాన్‌ వేరియంట్ నేపథ్యంలో ప్రజలెవరూ ఆందోళనకు గురికావొద్దని.. ఒమిక్రాన్‌ వల్ల ప్రాణభయం లేదని పేర్కొన్నారు హరీష్ రావు. అందరూ కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోవాలి, బూస్టర్‌ డోస్‌పై కేంద్రాన్ని కోరామని పేర్కొన్నారు.

ప్రజలంతా మాస్కులు ధరించాలి, భౌతికదూరం పాటించాలని కోరారు మంత్రి హరీష్‌రావు. ఒమిక్రాన్‌ వేరియంట్ కేసుల నమోదైనప్పటికి.. దానిని ఎదుర్కొనేందుకు తాము అన్నీ ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు. థర్డ్ వేవ్ వచ్చినా అన్నీ ఏర్పాట్లు చేసుకున్నామని వెల్లడించారు.

కాగా హైదరాబాద్ లో తొలి ఓమిక్రాన్ కేేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం తెలంగాణ లో కూడా ప్రస్తుతం 2 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇటీివల అబుదాబి నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు ఓమిక్రాన్ సోకినట్లు అధికారులు గుర్తించారు. మరొకరు ఇక్కడ నుంచి ఇతర ప్రాంతానికి వెళ్లిన మరో ప్రయాణికుడికి ఓమిక్రాన్ సోకినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో బాధితులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news