సగం మందికి స్కిల్స్ లేవట.. మరి ఉద్యోగాలెలా వస్తాయి…!

-

పోటీ ప్రపంచంలో ఏ ఉద్యోగం సాధించాలన్నా.. నైపుణ్యాలు తప్పనిసరి. స్కిల్స్ ఉన్న వారికే కంపెనీలు తొలి ప్రాధాన్యత ఇస్తున్నాయి. స్కిల్స్ ఉంటే చాలు ఏడాదికి లక్షల్లో ప్యాకేజీలు ఇచ్చి హైర్ చేసుకుంటున్నాయి. కాగా చాలా మందికి నైపుణ్యాలు లేకపోవడంతో నిరుద్యోగంలోనే ఉంటున్నారు. బట్టి చదువులు, మొక్కబడి చదువులతో చాలా మంది విద్యార్థులు నైపుణ్యాలకు దూరం అవుతున్నారు.

కాగా తాజా అధ్యయనంలో సగం మంది యువతకు స్కిల్స్ లేవని పేర్కొంది. మనదేశంలో డిగ్రీ పూర్తి చేసి బయటకు వచ్చిన విద్యార్థుల్లో సగం మందికి ఉద్యోగాలని సరిపడే నైపుణ్యాలు లేవని స్కిల్ ఇండియా నివేదిక వెల్లడించింది. కేవలం 45.9 శాతం మందికి మాత్రమే ఉద్యోహానికి సంబంధించిన అర్హతలు ఉన్నాయని వెల్లడించింది. డిగ్రీ పూర్తి చేసిన వారిలో కన్నా బీటెక్ పూర్తి చేసిన వారిలోనే ఎక్కువగా స్కిల్స్ ఉన్నాయని రిపోర్ట్ పేర్కొంది.  2022లో ఇంటర్నెట్, బిజినెస్, సాఫ్ట్ వేర్, ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని స్కిల్ ఇండియా రిపోర్ట్ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news