తెలంగాణలో వారందరికీ 10 కిలోల రేషన్ బియ్యం పంపిణీ

-

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కొండపాక మండల కేంద్రం, మండలంలోని ఖమ్మంపల్లి, జప్తి నాచారం మరియు దుద్దెడ గ్రామాల్లో నిర్మించిన 218 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి హరీష్ రావు ప్రారంభించి, లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో అద్భుతమైన పోరాట స్ఫూర్తిని చూపించిన కొండపాక గడ్డ పోరాటాలకు అడ్డగా ఉండేది. అలాంటి కొండపాకలో రాష్ట్ర సాధన అనంతరం ఈరోజు సంక్షేమ పథకాలు అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు.

గౌరవ పెద్దలు, సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరికి 2000 రూపాయల పెన్షన్ 10 కేజీల బియ్యం అందిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ బిజెపి అధికారం ఉన్న రాష్ట్రాల్లో 200,500కు మించి పెన్షన్ ఇవ్వట్లేదు. కాంగ్రెస్ బిజెపి అధికారం ఉన్న రాష్ట్రాల్లో రెండు వేల రూపాయల పెన్షన్లు ఇస్తున్నారా,ఆడబిడ్డ పెళ్లయితే కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారా, డెలివరైతే కేసీఆర్ కిట్ ఇస్తున్నారా, రైతులకు రైతుబంధు, రైతు బీమా,24 గంటల కరెంటు ఏ రాష్ట్రంలో నైనా ఇస్తున్నారా అని ప్రశ్నించారు.

తెలంగాణలో అమలైతున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక బిజెపి కాంగ్రెస్ నాయకులు రాజకీయాలు చేస్తున్నారు…ఢిల్లీలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఉచితాలు వద్దు అంటుంది, ఆసరా పెన్షన్లు వద్దంట, కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ వద్దంట, రైతులకు రైతుబంధు ఈయొద్దంట, ఉచిత కరెంటు ఆపి బాయిల కాడ మీటర్లు పెట్టాలంట అంటూ ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news