విమర్శలు.. ప్రతి విమర్శలు.. ఆందోళనలు.. వార్నింగ్ లుతో తెలంగాణ అసెంబ్లీ గందరగోళంగా మారింది.. భూభారతి బిల్లుపై చర్చించే సమయంలో దాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు.. కేటీఆర్ పై అక్రమంగా కేసు పెట్టారంటూ ఆందోళనకు దిగారు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ధీటుగా కాంగ్రెస్ నేతలు పైర్ అయ్యారు.. దీంతో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రణరంగంగా మారాయి..
అసెంబ్లీలో ప్రజా సమస్యలను చర్చించాల్సిన ప్రజాప్రతినిధులు.. స్వంత అజెండాతో పనిచేశారు..
ఫార్ములా ఈ-రేస్ అంశంపై చర్చించాలంటూ బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు.. ప్రభుత్వం అంగీకరించకపోవడంతో.. వెల్ లోకి వెళ్లి ఆందోళన చేశారు.. గవర్నర్ అనుమతి ఇచ్చిన తర్వాతే కేటీఆర్ పై కేసు పెట్టామంటూ కాంగ్రెస్ సభ్యులు చెబుతున్నా.. చర్చించాల్సిందేనంటూ ఆందోళన చెయ్యడంతో సభను స్పీకర్ వాయిదా వేశారు..
వాయిదా అనంతరం బీఆర్ఎస్ నిరసనలు కొనసాగాయి.. భూభారతి బిల్లుపై మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా స్పీకర్ పోడియం దగ్గరకు దూసుకెళ్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరోసారి ఆందోళన చేపట్టారు. పేపర్లు చించి స్పీకర్‌పైకి విసిరేశారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు పార్టీల ప్రజాప్రతినిధులు పేపర్లు విసరడంతో సభలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
ప్రభుత్వం తనకు నచ్చిన వారి మీద అక్రమ కేసులు బనాయిస్తోందని.. ఫార్ములా ఈ-రేస్ పై చర్చకు రాకుండా పారిపోతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించగా.. వారికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ధీటుగా సమాధానం ఇచ్చారు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మధ్య పొలిటికల్ డైలాగ్స్ రణరంగాన్ని తలపించింది..