తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి ప్రభుత్వ ఆస్పత్రి లను హరీష్ రావు తనిఖీ చేశారు. ఇక నుంచి ప్రతి ఆస్పత్రి కి ఆకస్మతుగా వస్తా నని మంత్రి హరీష్ రావు అన్నారు. పీహెచ్ సీ ల నుంచి జిల్లా, మెడికల్ కాలేజీ ల వరకు తనిఖీ చేస్తా నని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో వైద్య విభాగం నుంచి రూ. 10 వేల కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నామని హరీష్ రావు అన్నాడు.
కాగ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ రాజీనామా చేసిన తర్వాత ఇప్పటి వరకు ముఖ్య మంత్రి కేసీఆర్ వద్దే ఈ శాఖ ఉండేది. అయితే ముఖ్య మంత్రి పని ఒత్తిడి వల్ల ఈ శాఖ పై శాఖ పై దృష్టి సారించ లేదు. దీంతో వైద్య ఆరోగ్య శాఖ ను ఆర్థిక మంత్రి అయిన హరీష్ రావు కు అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో రాష్ట్రంలో ఉన్న వైద్య ఆరోగ్య విభాగాన్ని సరిచేయడానికి హరీష్ రావు రంగం లోకి దిగాడు. అందుకే ప్రతి ప్రభుత్వ ఆస్పత్రి ని తాను ఆకస్మతుగా తనిఖీ చేస్తానని ప్రకటించాడు. ప్రభుత్వ ఆస్పత్రి లపై హరీష్ రావు ప్రత్యేక దృష్టి పెడుతున్నట్టు తెలుస్తుంది.