ఫిల్మ్ నగర్ PHC కొత్త భవనం మంజూరు చేస్తాం – హరీష్‌ రావు

-

ఫిల్మ్ నగర్ PHC కొత్త భవనం మంజూరు చేస్తామని శాసన సభలో ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. వైద్యం విషయంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యమని.. రాష్ట్రం ఏర్పడ్డ నాడు 850 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే 2790 కి పెంచామని వెల్లడించారు. సమైక్య రాష్ట్రంలో ఏర్పాటు చేసినవి మూడు కాలేజీలు అని..ఆనాడు మూడు ఏర్పాటు చేస్తే, మేము ఒక్క ఏడాదిలో 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించామని పేర్కొన్నారు.

ఒక్క ఉమ్మడి మహబూబ్ నగర్ లోనే 5 మెడికల్ కాలేజీలు వస్తాయని కలలో అయినా అనుకున్నారా..ములుగు, సంగారెడ్డిలో మా పార్టీ ఎమ్మెల్యే లేకున్నా మెడికల్ కాలేజీ ఇచ్చామని గుర్తు చేశారు. కేంద్రం 157 మెడికల్ కాలేజీలు ఇస్తే, ఒక్కటి కూడా ఇవ్వలేదని విమర్శలు చేశారు. నాటి మంత్రులుగా ఉన్న ఈటెల రాజేందర్, లక్ష్మారెడ్డి లేఖలు కూడా రాశారు…కేంద్రం ఇవ్వకున్నా సీఎం కేసీఆర్ గారు మెడికల్ కాలేజీలు ప్రారంబించారని వెల్లడించారు. బీబీ నగర్ ఎయిమ్స్ పరిస్థితి దారుణంగా ఉంది. ఐపీ లేదు, ఓపీ లేదు, ఆపరేషన్లు చేయరు….విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని భువనగిరి జిల్లా ఆసుపత్రిలో ప్రాక్టికల్స్ చేసే అవకాశం కల్పించామన్నారు హరీష్‌ రావు.

Read more RELATED
Recommended to you

Latest news