తెలంగాణ మహిళలకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. సిద్దిపేట 5వ వార్డులో పరిశుభ్రతతో భాగంగా. రుతు ప్రేమ పైలట్ ప్రాజెక్టు గా మార్గనిర్దేశక కార్యక్రమంలో.. మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. రుతు ప్రేమ అనేది మాట్లాడానికి జుగుప్సాకరంగా ఉంటుందని.. నేడు మనం మొదటి మెట్టు ఎక్కాం అంటే మీ మహిళల సహకారం వల్లనేనని చెప్పారు. వీటి వాడకం వల్ల ఆరోగ్య సమస్యలతో పాటు, డబ్బు వృధా కాదని…. ఇది ప్రపంచంలో ఉండే ప్రతి మహిళ కు ప్రతి నెల జరుగుతున్న ప్రక్రియ అన్నారు.
ఈ వార్డు ప్రజలు తడి, పొడి, హానికరమైన చెత్త ఇవ్వడం లో అదర్షంగా నిలిచారు కావున ఈ వార్డు పైలెట్ ప్రాజెక్టుగా ఎన్నుకున్నామని.. మీ ఆరోగ్యం ను మీరే కాపాడుకోవాలి , ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. వీటిని ప్రపంచ వ్యాప్తంగా వాడుతున్నారని.. 35 న్నర వేల కోట్ల మహిళలు ప్లాస్టిక్ వాడుతున్నారన్నారు. జిల్లాలోని మహిళ ఉద్యోగులకు త్వరలోనే అవగాహన సదస్సు పెట్టీ ప్యాడ్స్ పంపిణీ చేస్తామని ప్రకటన చేశారు. ఈ కార్యక్రమము రాష్ట్రం లోనే మొట్ట మొదటిసారిగా ఇక్కడ నిర్వహిస్తున్నామని.. నార్మల్ డెలివరీ ఎక్కువగా చేయాలన్నారు. మన రాష్ట్రంలో డెలివరీ కోసం చేసే సర్జరీలు 62 శాతంగా ఉందని.. మొదటి గంటలో ముర్రుపాలు తాగేది మన రాష్ట్రంలో 37శాతం మాత్రమేనని పేర్కొన్నారు. పుట్టిన ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత మనపైన ఉందని.. రానున్న రోజుల్లో అన్ని వార్డులలో పంపిణీ చేస్తామన్నారు. ప్యాడ్స్ వాడకంలో మనం ప్రపంచానికి ఆదర్శం కావాలని పేర్కొన్నారు.