రిలీజ్ కి ముందే తలపతి విజయ్ సినిమా “బీస్ట్” బ్యాన్..!

-

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తలపతి విజయ్ నటించిన “బీస్ట్” సినిమా ఏప్రిల్ 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమైంది. విడుదలకు ముందే ఈ సినిమాకి అడ్డంకులు ఏర్పడ్డాయి. కొద్ది రోజుల క్రితం రిలీజ్ అయిన ట్రైలర్ లో హైజాక్ కు గురైన ఒక మాల్ లో సాగే యాక్షన్ థ్రిల్లర్ గా సినిమా ఉండనున్నట్లు ట్రైలర్ లో తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.

కొన్ని అరబిక్ దేశాల్లో ముస్లింలను ఉగ్రవాదులుగా చూపించే సినిమాలను ప్రదర్శించడానికి అంగీకరించవు. ఇందులో భాగంగానే కువైట్ ప్రభుత్వం “బీస్ట్” సినిమాను తమ దేశంలో నిషేధించింది. ఇంతకుముందు కూడా దుల్కర్ సల్మాన్ సినిమా ‘కురుప్’ ని కూడా కువైట్ ప్రభుత్వం బ్యాన్ చేసింది. కువైట్ లో “బీస్ట్” సినిమాను బ్యాన్ చేయడం అదే బాటలో మరో అరబ్ దేశం కూడా ఇలానే చేసిన విజయ్ కి బాక్సాఫీస్ వద్ద సినిమా వసూళ్ల పరంగా భారీ దెబ్బతీస్తోందని చెప్పుకోవాలి. రిలీజ్ కి ముందే కొన్ని దేశాలలో సినిమా బ్యాన్ కావడం తో విజయ్ ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు

Read more RELATED
Recommended to you

Latest news