సోనియా ప్రసంగంపై తెరాస నేతల స్పందన…

-

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మొదటి సారి వచ్చిన సోనియా గాంధీ …తెరాస ప్రభుత్వంపై పలు రకాల విమర్శలు చేశారు. శుక్రవారం సాయంత్రం మేడ్చెల్‌ల్లో నిర్వహించిన బహిరంగ సభలో సోనియా గాంధీ తెలుగు రాష్ట్రాల గురించి ప్రస్తావించిన విషయం తెలిసిందే.. అయితే తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ పలు వ్యాఖ్యలు చేయడాన్ని తెరాస ముఖ్య నేతలు హరీష్ రావు, ఎంపీ కవిత మీడియా సమావేశంలో మాట్లాడుతూ… తీవ్రంగా  తప్పుబట్టారు . తెలంగాణ సభలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఏ విధంగా ప్రస్తావిస్తారని వారు ప్రశ్నించారు. ఏపీలోనే దిక్కులేని చంద్రబాబుతో దోస్తీ కట్టి ఇక్కడ ఏం సాధిస్తారని హరీష్‌ అన్నారు.

మెదక్‌ టీడీపీ నేతలు ఎల్‌ రమణ సమక్షంలోనే కాంగ్రెస్‌లో చేరాడాన్ని చూస్తుంటే రానున్న రోజుల్లో ఎన్టీఆర్ భవనాన్ని రాజీవ్‍ గాంధీ భవన్ గా మార్చిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌ నేతలు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌ పక్షానే నిలబడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఇంకేమైనా ఉందా అంటూ ఎంపీ కవిత విమర్శించారు. మేడ్చల్ వచ్చిన సోనియా గాంధీ తెలంగాణ గురించి కాకుండా.. పక్క రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామనడం ఏంటని ప్రశ్నించారు కవిత. సోనియా మాటలు చూస్తుంటే.. చంద్రబాబు మాటలుగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ నెల 26న జగిత్యాలలో జరగనున్న సభలో సోనియా ఎత్తులు చిత్తు చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news