ఒక్కొక్కరికి తల నొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది. అటువంటప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మీకు కూడా ఎక్కువగా తల నొప్పి వస్తూ వస్తున్నట్టయితే ఈ చిట్కాలను పాటించండి. శబ్దాలు, కాన్స్టిపేషన్, టెన్షన్ మొదలైన వాటి వల్ల తలనొప్పి వచ్చే అవకాశం ఉంది.
కంప్యూటర్ ముందు ఎక్కువగా కూర్చున్నా కూడా తల నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. తల నొప్పి తగ్గాలంటే ఈ ఆయుర్వేద చిట్కాలు బాగా ఉపయోగ పడుతాయి మరి తల నొప్పిని తగ్గించే ఆయుర్వేద చిట్కాలు గురించి ఇప్పుడు చూద్దాం.
దాల్చిని పొడి:
దాల్చిని చెక్కను తీసుకుని పొడి కింద చేసుకుని అందులో కొంచెం నీళ్లు వేసుకుని పేస్టు మాదిరిగా చేసి నుదిటి మీద అప్లై చేస్తే తల నొప్పి తగ్గుతుంది. దీంతో రిలాక్స్ గా ఉండడానికి అవుతుంది. అలానే చిటికెలో తల నొప్పి మాయం అవుతుంది.
గ్రీన్ టీ మరియు నిమ్మరసం :
గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఇది తల నొప్పిని కూడా తగ్గిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్నాయి. గ్రీన్ టీ ని తీసుకోవడం వలన ఇతర లాభాలను కూడా మనం పొందొచ్చు. నిమ్మ రసం తో గ్రీన్ టీ ని తీసుకుంటే కూడా తల నొప్పి తగ్గి రిలాక్స్ గా ఉండొచ్చు.
లావెండర్ ఆయిల్:
లావెండర్ ఆయిల్ కూడా తలనొప్పిని తగ్గిస్తుంది. లావెండర్ ఆయిల్ ని మీరు నుదుటి మీద అప్లై చేసుకోండి. అలాగే కొద్దిగా లావెండర్ ఆయిల్ ని పీల్చండి ఇలా తల నొప్పిని తగ్గించుకో వచ్చు.