ఈటలపై హరీష్‌ రావు ఫైర్‌.. గడియారాలు పంచడం ఆత్మగౌరవమా !

-

సిద్దిపేట : మంత్రి హరీష్ రావు సమక్షంలో హుజురాబాద్ కి చెందిన బీజేపీ, కాంగ్రెస్ స్థానిక నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. దళితుల ఓట్లను చీల్చేందుకు బిజేపీ, కాంగ్రెస్‌ కుమ్మక్కు అయ్యాయని..హుజూరాబాద్‌లో చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. మోడీ బొమ్మను, బిజేపీ జెండాను దాచి ప్రచారం చేస్తున్నారని… బిజేపీకి ఓటువేస్తే పెట్రోల్‌ ధర రూ.200 దాటిస్తారు..ఈటల గెలిస్తే ఆయనకు మాత్రమే లాభమని పేర్కొన్నారు.

టిఆర్‌ఎస్‌ను గెలిపిస్తే హుజూరాబాద్‌ ప్రజలకు ప్రయోజనమన్నారు. మోడీతో కొట్లాడి ఈటల వెయ్యి కోట్ల ప్యాకేజీ తేగలడా? గడియారాలు, కుక్కర్లు పంచడమే ఆత్మగౌరవమా? అని నిలదీశారు హరీష్‌ రావు. భారతదేశ ఆర్థిక వృద్ది కంటే బంగ్లాదేశ్‌ మెరుగుగా ఉందని..బెంగాల్‌, తమిళనాడులో బిజేపీని బండకేసి కొట్టారని చురకలు అంటించారు. బిజేపీ పార్టీ సైతం ఇతర దళిత నేతలను హుజూరాబాద్‌లో పోటీ చేయించాలని చూస్తున్నదని పేర్కొన్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఈటల చేసిందేమీ లేదని.. అక్కడ జరిగిన అభివృద్ధి, సంక్షేమం అంతా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే చేపట్టిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news