బస్సులో ఆక్సిజన్. కర్ణాటక ప్రభుత్వం వినూత్న ఆలోచన..

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కేసులు ఎంతగా పెరుగుతున్నాయో తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలామందికి ఆక్సిజన్ అవసరం ఏర్పడింది. కావాల్సినన్ని ఆక్సిజన్ సిలిండర్లు లేక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన వినూత్న ఆలోచన అందరికీ ఆసక్తిని కలిగిస్తుంది. ఆర్టీసీ బస్సులో ఆక్సిజన్ సిలిండర్లు, దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి, కావాల్సిన వాళ్ళకి ఉచితంగా అందిస్తుంది. ఆక్సిజన్ కావాలనుకున్న వాళ్ళు ఈ బస్సుల్లోకి వెళ్తే సరిపోతుంది.

ఆర్టీసీ బస్సుల్లో కొన్ని సీట్లు తీసివేసి, రోగులకి మధ్య దూరం పెంచుతూ ఆక్సిజన్ సిలిండర్లని ఏర్పాటు చేసింది. ఆక్సిజన్ కోసం ఆస్పత్రికి వెళ్ళే వారు ఇది వినియోగించుకోవచ్చు. ఆక్సిజన్ ఆన్ వీల్స్ అన్న పేరుతో ఈ నూతన కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంటుంది. దేశంలో ఆక్సిజన్ సేవలు ఇంత వినూత్నంగా అందరికీ అందుబాటులో ఉండేలా చేయడంతో ప్రశంసలు అందుతున్నాయి. ప్రస్తుతం దాదాపుగా దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ఉంది. దాని కారణంగా కరోనా కేసులు కొద్ది కొద్దిగా తగ్గుతున్నాయి.