నెలలోపు పైసా ఖర్చు లేకుండా కాళేశ్వరం ద్వారా నీళ్లు అందిస్తాం – మంత్రి హరీష్ రావు

-

నెలలోపు పైసా ఖర్చు లేకుండా కాళేశ్వరం ద్వారా నీళ్లు అందిస్తాం..యసంగికి కాళేశ్వరం ద్వారా నీళ్లు అందిస్తామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. ఇవాళ శాసన మండలిలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కాళేశ్వరం వృధా ప్రాజెక్టు కాదు.. కాళేశ్వరం తో ఖర్చు తగ్గిందన్నారు. ఈ నెల లోనే నీళ్ళు వస్తాయి.. ప్రతి పక్షాల దుస్ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు.

కాళేశ్వరం నీళ్ళు లేకుంటే అదనపు పంట ఎలా వచ్చింది.. మీకు చేతనైతే పండిన పంట కొనండని డిమాండ్ చేశారు. ప్రతి పక్షాల రూపంలో గోబెల్స్ బతికే ఉన్నాడన్నారు. లక్ష కోట్ల తో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాం.. కానీ ఇప్పుడు పెరిగిన ధరలతో కాళేశ్వరం కట్టాలంటే 2 లక్షల కోట్లు కావాలని పేర్కొన్నారు. ప్రజా ధనాన్ని ఆదా చేసాం..ముడున్నరేళ్ళలోనే నీళ్లు రావడం వల్ల పంటలు మత్య సంపద పెరిగిందని వెల్లడించారు. తెలంగాణ ఎకరం పక్క రాష్ట్రాల్లో 3 ఎకరాలు కొనేస్తున్నారు…బెంగాల్ ,నేపాల్ నుండి మగ కూలీలు వచ్చి తెలంగాణ లో వరి నాట్లు వేస్తున్నారని తెలిపారు హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news