హరీశ్ శంకర్ నిరాశ పోయినట్లే.! పవన్ సినిమా పనులు స్టార్ట్.!

దర్శకుడు హరీశ్ శంకర్ తన చివరి సినిమా వచ్చి దాదాపు మూడేళ్లు దాటినా కూడా ఇంకో సినిమా చేతుల్లో లేదు. పవన్ కళ్యాణ్ తో  భవదీయుడు భగత్ సింగ్ సినిమా చేయడానికి హరీష్ శంకర్ చాలా రోజుల గా ఎదురు చూస్తున్నాడు.కాని ప్రస్తుతం పవన్ కల్యాణ్ పరిస్థితి కూడా సరిగా లేదు. కొన్ని రోజులు షూటింగ్ కోసం కొన్ని రోజులు రాజకీయాల కోసం సర్దుబాటు చేస్తూ వస్తున్నాడు.

పవన్ ముందుగా చేస్తున్న ‘హరి హర వీరమల్లు’ సినిమా వాయిదాలు పడుతూ సకాలంలో పూర్తి కాక పోవడం  జరుగుతోంది.దీంతో హరీష్ శంకర్ క్రేజీ ప్రాజెక్ట్ ‘భవదీయుడు భగత్ సింగ్’పై ఎలాంటి అప్ డేట్ రావడంలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ వున్నట్టా లేనట్టా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రీసెంట్ గా జరిగిన ఆడియో వేడుకలో పాల్గొన్న హరీశ్ శంకర్ తనని విపరీతంగా పొగిడే సరికి, నేను ఏమి పుల్ జోష్ లో లేను మూడేళ్ల గా సినిమా లేకుండా ఖాళీగా ఉన్నాను అని తన మీద తానే పంచ్ వేసుకున్నాడు.

కాని తన నిరాశను పోగొట్టే న్యూస్ ఒకటి బయటకి వచ్చింది . పవన్ సన్నిహితుల ద్వారా వినిపిస్తోన్న వార్తల ప్రకారం.. హరీశ్ శంకర్‌తో కమిట్ అయిన సినిమాను జనవరి లో ప్రారంభించాలని పవన్ ఫిక్స్ అయ్యాడట. తానే దర్శకనిర్మాతలను పిలిచి.. ఈ ప్రాజెక్ట్ గురించి చర్చలు జరిపినట్టు తెలిసింది. తాను ఏయే సమయాల్లో ఖాళీగా ఉంటానన్న డేట్స్ ఇచ్చి, ఆ టైంలో షూటింగ్ ప్లాన్ చేయాలని కూడా పవన్ సూచించినట్టు తెలుస్తోంది. చాలా తక్కువ రోజుల్లో షూటింగ్ కంప్లీట్ అయ్యేలా చూడమని చెప్పారట. ఇక త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది.