హరీశ్ శంకర్ తెలుగు లో చేసింది కొన్ని సినిమాలే అయినా ఎప్పుడూ మీడియాలో హాట్ టాపిక్ గా ఉంటూ ఉంటారు. తాను పవన్ కల్యాణ్ తో తీసిన గబ్బర్ సింగ్ తమను మరింత పాపులర్ చేసింది. మళ్లీ ఎప్పుడు పవన్ తో సినిమా అన్న ప్రశ్నలకు రీసెంట్ గా సమాధానం వచ్చిన సంగతి తెలిసిందే. హరీశ్ శంకర్ ముందు అనుకున్న ‘భవదీయుడు భగత్ సింగ్’ వదిలి, తమిళ సినిమా అయిన తెరి ను రీమేక్ కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు.
ఇప్పుడు ఆ సినిమా పేరు లో తాను పవన్ కోసం ఇష్టంగా పెట్టుకున్న భగత్ సింగ్ ఉంచుతూ ముందు ఉస్తాద్ భగత్ సింగ్ గా పవర్ ఫుల్ పేరు పెట్టి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు. అయితే తాను ఈ సినిమా కోసం మూడేళ్ళు గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ గ్యాప్ లో ఖాళీ గా ఉండకుండా అతను వెబ్ సీరీస్ లలో సత్తా చాటాలని ప్రయత్నంలో అవమానాలు పొంది నట్లుగా కనపడుతోంది. వాస్తవానికి సినిమా నుండి వెబ్ సీరీస్ అంటే స్థాయి తగ్గించు కున్నట్లే. అయినా ఆత్మాభిమానం కోసం వెబ్ సీరీస్ కోసం వెళితే కంటెంట్ హెడ్స్ అవమానం పాలు చేశారని ఫైర్ అయ్యారు హరీష్ శంకర్.
తాజాగా హరీశ్ శంకర్ మాట్లాడుతూ ఓటీటీల్లో కంటెంట్ హెడ్ లు తమ హోదాని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ వారి పనిని మాత్రం ఎంజాయ్ చేయడం లేదు. ఎంత పెద్ద డైరెక్టర్ అయినా వాళ్ల ఆఫీసుకి వెళ్లి గంటల తరబడి నిరీక్షించాల్సిందే. సినిమా అంటే ప్యాషన్ వున్న వాళ్లం. దాని కోసం ఎన్ని గంటలైనా వేచి చూస్తాం. కానీ ఓటీటీ కంటెంట్ హెడ్ లు క్రియేటర్స్ ను గౌరవించాలి అంటూ ఫైర్ అయ్యారు హరీష్.