హరీశ్ శంకర్ బాలీవుడ్ హీరోతో ” సిద్ధార్థ్ రాయ్”..!!

-

దర్శకుడు హరీశ్ శంకర్ తన చివరి సినిమా వచ్చి దాదాపు మూడేళ్లు దాటినా కూడా ఇంకో సినిమా చేతుల్లో లేదు. పవన్ కళ్యాణ్ తో  భవదీయుడు భగత్ సింగ్ సినిమా చేయడానికి హరీష్ శంకర్ చాలా రోజుల గా ఎదురు చూస్తున్నాడు.కాని ప్రస్తుతం పవన్ కల్యాణ్ పరిస్థితి కూడా సరిగా లేదు. కొన్ని రోజులు షూటింగ్ కోసం కొన్ని రోజులు రాజకీయాల కోసం సర్దుబాటు చేస్తూ వస్తున్నాడు.

పవన్ ముందుగా చేస్తున్న ‘హరి హర వీరమల్లు’ సినిమా వాయిదాలు పడుతూ సకాలంలో పూర్తి కాక పోవడం  జరుగుతోంది.దీంతో హరీష్ శంకర్ క్రేజీ ప్రాజెక్ట్ ‘భవదీయుడు భగత్ సింగ్’పై ఎలాంటి అప్ డేట్ రావడంలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ వున్నట్టా లేనట్టా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హరీష్ శంకర్ మాత్రం స్క్రిప్ట్ మరియు పవర్ఫుల్ డైలాగ్లు రాసుకొని మరీ బౌండ్ స్క్రిప్ట్ దగ్గర ఉంచుకున్నాడు.పవన్ ప్యాన్స్ మాత్రం ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాని రీసెంట్ గా పవన్ కూడా ఈ సినిమా ఎన్నికలు తర్వాత చేద్దామని చెప్పారట. దీనితో నిరాశ చెందిన హరీశ్ బాలీవుడ్ బాట పట్టాడట. ఎందుకంటే ఇప్పుడు బాలీవుడ్ లో టాలీవుడ్ స్క్రిప్ట్స్ కు , డైరెక్టర్స్ కు మంచి డిమాండ్ ఉంది. దీనిలో భాగంగా హరీశ్ శంకర్ ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్ రిజిస్టర్ చేయించాడట.  ఆ సూపర్ టైటిల్ ఏంటో తెలుసా సిద్ధార్థ్ రాయ్. ఇది ఎక్కడో విన్నట్లు ఉందిగా గురూ. ఇది మన పవర్ స్టార్ ఖుషి సినిమాలో  చెప్పిన  డైలాగ్. ఈ సిద్ధార్థ్ రాయ్ పేరు హిందీ జనాలకు సూట్ అవుతుంది అని పెట్టారని వార్తలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news