మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. అశ్వారావుపేట సమితిగా ఉన్నపుడు తాను అందరిని పోటీ చేయాల్సిందిగా కోరానని.. కానీ ఎవరు రాకపోవడంతో నేనే పోటీలోకి వచ్చానన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో లేని అభివృద్ధి మన అశ్వారావుపేట నియోజకవర్గనికి అభివృద్ధి చేసానన్నారు తుమ్మల.
అలానే ఉమ్మడి రాష్ట్రంలో ఓ నలుగురు ముఖ్యమంత్రి నియోజకవర్గ లకు కూడా నేను మంత్రిగా ఉన్నపుడు అభివృద్ధి చేశానన్నారు. హైదరాబాద్ రింగ్ రోడ్డు చంద్రబాబు హయాంలో నేనే ఘాట్కరి గారి దగ్గర మాట్లాడి సాంక్షన్ చేయించాను అన్నారు. రెండోసారి హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు కి కూడా తానే కష్టపడ్డాను అన్నారు. తాను అభివృద్ధి చేయడం ఎన్టీఆర్ పుణ్యమే అన్నారు. నేను ఏ ప్రభుత్వంలో పనిచేసిన ఆ ప్రభుత్వానికి, ఆ ముఖ్యమంత్రి కి మంచి పెరు వచ్చేలా పనిచేశానన్నారు.
నా పదవి కాలంలో చేసిన పనులు నేను పదవిలో ఉన్న లేకున్నా సమాజానికి ప్రజలకు ఉపయోగపడేలా చేశానన్నారు. వ్యక్తిగతంగా ఎవరికి నా వల్ల లబ్ది ఉండదని.. సమాజానికి, ప్రజలకు ఉపయోగపడేలా మాత్రమే నా పనులు ఉంటాయన్నారు. జిల్లాలో భారీ ప్రాజెక్టులు మొత్తం తానే కట్టించానన్నారు. తన నియోజకవర్గాన్ని చూసి కేసిఆర్ కానీ, హరీష్ రావు కానీ అలా అభివృద్ధి అయ్యేలా మాట్లాడుకోవాలని తన ఉద్దేశం అన్నారు. తన ఉద్దేశం అభివృద్ధి విషయం ఈ ప్రాంతంలో ఉన్నవారు ఆనందపడలి, పక్క ప్రాంతం వాళ్ళు మనం ఇక్కడ ఎందుకు లేమని అసూయపడాలన్నారు.