ఆయన నా కాళ్లు మొక్కలేదు.. ఖండించిన ఎమ్మెల్యే హరీశ్ రావు

591

కల్యాణంలో పాల్గొంటున్న సమయంలో.. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. హరీశ్ రావు కాళ్లు మొక్కబోయారంటూ ఓ దిన పత్రిక ప్రచురించింది. ఆ పత్రిక కథనం తప్పు అని హరీశ్ రావు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.

తనపై ప్రింట్ అయిన ఓ వార్తను సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవంలో ఎమ్మెల్యే హరీశ్ రావుతో పాటు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని తదితరులు పాల్గొన్నారు.

అయితే.. కల్యాణంలో పాల్గొంటున్న సమయంలో.. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. హరీశ్ రావు కాళ్లు మొక్కబోయారంటూ ఓ దిన పత్రిక ప్రచురించింది. ఆ పత్రిక కథనం తప్పు అని హరీశ్ రావు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నేలమీది నుంచి లేచి నిలబడేందుకు ప్రయత్నిస్తుండగా సాయపడ్డాను. దీన్ని తప్పుగా అర్థం చేసుకొని ప్రచురించారు. ఈవార్తను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది బాధాకరం. భవిష్యత్ లో వార్తలు ప్రచురించేముందు నిర్ధారణ చేసుకుని ప్రచురించాలని కోరుతున్నానంటూ హరీశ్ రావు ట్వీట్ చేశారు.