ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. ఇక‌పై డాక్టర్లు, నర్సులకు డబుల్ శాలరీ..!!

-

క‌రోనా వైర‌స్ లేదా కోవిడ్‌-19.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల్లో విలయ తాండవం చేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి 209 దేశాలకు పాకింది. రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇప్ప‌టికే ప్రపంచవ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసులు 15 ల‌క్ష‌లు దాట‌గా.. మృతుల సంఖ్య 85 వేలు దాటింది. చైనాలో వుహాన్‌లో ప్రారంభమైన ఈ వైరస్ ఇటలీ, స్పెయిన్, అమెరికా లాంటి దేశాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మరోవైపు ఇతర దేశాల్లో కూడా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది.

ఇక కట్టడికి పలు దేశాలు లాక్‌డౌన్ విధించాయి. మొత్తం 350 కోట్ల మంది ఇళ్లకే పరిమితయ్యారు. కోట్లాది మంది జీవనోపాధిని సైతం మహమ్మారి చిన్నాభిన్నం చేసింది. అన్ని రంగాలూ క‌రోనా దెబ్బ‌కు అబ్బా అంటున్నాయి. ఇక వైరస్‌కు ఇప్పటి వరకు ఎలాంటి చికిత్సగానీ, వ్యాక్సిన్‌గానీ అందుబాటులో లేదు. దీంతో అంద‌రూ నివార‌ణ‌పైనే ఫోక‌స్ చేస్తున్నారు. అయితే ఇలాంటి ప‌రిస్థితుల్లో త‌మ ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి డాక్టర్లు, నర్సులు కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే హర్యానా ప్రభుత్వం శుభ‌వార్త అందించింది.

కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో పోరాడుతున్న డాక్టర్లు, నర్సులు, ఇతర పారా మెడికల్ సిబ్బందికి డబుల్ శాలరీలు ఇస్తామని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కీలక ప్రకటన చేశారు. క‌రోనా తగ్గేంత వరకు వీళ్లకు నెలకు ఇచ్చే జీతం డబుల్ ఇస్తామన్నారు. అంతేకాకుండా, కరోనా వైరస్ విధులు నిర్వర్తిస్తూ ఎవరైనా పోలీసు చనిపోతే వారి కుటుంబాలకు రూ. 30 లక్షల పరిహారాన్ని ఇస్తామని సీఎం ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news