నిన్న ఒక్క రోజే 10 వేల మంది మరణం, లక్ష పాజిటివ్ కేసులు…!

-

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. దాదాపు అన్ని దేశాలకు ఈ కరోనా మహమ్మారి చుక్కలు చూపిస్తుంది. మన దేశంలో కూడా క్రమంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నిన్న ఒక్క రోజే పది వేల మంది ప్రజలు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో పలు దేశాలకు చెందిన ప్రజా ప్రతినిధులు కూడా ఉన్నారు. అలాగే చిన్న పిల్లలు కూడా ఎక్కువగానే ఉన్నారు.

అమెరికాలో నిన్న ఒక్క రోజే 30 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు బయటకు రాగా అక్కడ రెండు వేల మంది గురువారం ప్రాణాలు కోల్పోయారు. ఇక ఫ్రాన్స్, జర్మని, స్పెయిన్, ఇటలీ లో కేసులు పెరుగుతున్నాయి గాని తగ్గడం లేదు. రోజు రోజుకి అక్కడ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. బ్రిటన్ లో నిన్న ఒక్క రోజే 900 మంది వరకు కరోనా సోకి ప్రాణాలు కోల్పోయారు అంటే పరిస్థితి ఎంత భీకరంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

కరోనా వైరస్ ని ఎదుర్కోవడానికి అమెరికా సహా అభివృద్ధి చెందిన దేశాలు ఎన్ని విధాలుగా నివారణా మార్గాలను వెతుకుతున్నా సరే దాని పని అది చేసుకుంటూ పోతుంది. అమెరికాలో కరోనా కేసులు 5 లక్షలకు చేరువలో ఉండగా స్పెయిన్ లో కరోనా కేసులు లక్షా 50 వేలకు దగ్గరలో ఉన్నాయి. ఇక జర్మని లో మరణాలు తక్కువగా ఉన్నా సరే కేసులు మాత్రం అక్కడ ప్రతీ రోజు దాదాపు మూడు నుంచి ఆరు వేల వరకు పెరుగుతున్నాయి.

అమెరికాలో మరో రెండు వారాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇరాన్ లో కూడా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనా దెబ్బకు ఇప్పుడు చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. అయినా సరే కేసులు మాత్రం చాలా వేగంగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితి ఇంకో రెండు వారాల్లో అందుబాటులోకి రాకపోతే పరిస్థితులు మరింత క్షీణించి ప్రజలు ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news