శవాలను నదిలో వదిలేస్తున్నారు…!

-

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ తీసుకొచ్చిన కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దేశంలో ఇప్పుడు వేలాది మంది లాక్ డౌన్ తో కష్టాలుపడుతున్నారు. తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు. దీని నుంచి ఏ విధంగా బయటపడాలో అర్ధం కావడం లేదు వాళ్లకు. ఇక ఇది పక్కన పెడితే ఎవరైనా చనిపోతే దహన సంస్కారాలు అనేవి ఎక్కడా జరగడం లేదు. దహన సంస్కారాలు జరిపించడానికి కూడా ఇప్పుడు స్మశాన వాటికలు దొరకడం లేదు.

కొందరు పేదలు అయితే ఇప్పుడు స్మశాన వాటికలలో ఎవరూ అందుబాటులో లేకపోవడం తో చాలా మంది తమ వాళ్ళ మృతదేహాలను నదుల్లో కలిపేస్తున్నారు. బయటకు వస్తే పోలీసుల భయం… చనిపోయిన వాళ్ళు సాధారణంగా చనిపోయినా సరే కరోనా పరిక్షలు చేస్తూ కుటుంబ సభ్యులను క్వారంటైన్ చేస్తున్నారు. దీనితో ఎం చెయ్యాలో అర్ధం కాని నదుల పక్కన ఉన్న వాళ్ళు తమ వాళ్ళ మృతదేహాలను నదుల్లో వదిలేస్తున్నారని సమాచారం.

దీనికి సంబంధించిన వార్తలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని లాక్ డౌన్ ఇదే విధంగా కొనసాగితే మాత్రం పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఇక కొన్ని ప్రాంతాల్లో అయితే అస్తికలను కూడా కుటుంబ సభ్యులకు ఇచ్చే పరిస్థితి లేదు అనే వ్యాఖ్యలు కూడా వినపడుతున్నాయి. రాజస్థాన్ లో ఇదే పరిస్థితి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news