అల్లు అర్జున్ ను పరామర్శించిన సినీ సెలబ్రిటీలపై సీఎం రేవంత్ రెడ్డి మండి పడ్డారు. ఓ బాలుడు దాదాపు నెల రోజులుగా ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతుంటే వీళ్లు ఎవరైనా పరామర్శించారా..? ఒక పూట జైలుకు వెళ్లిన హీరోను మాత్రం కాళ్లు చేతులు పోయిన మనిషిని చూడటానికి వెళ్లినట్టు వెళ్లారు. అల్లు అర్జున్ కాలు పోయిందా? కన్ను పోయిందా? దేనికి పరామర్శలు అన్నారు. ఆసుపత్రిలో ఓ ప్రాణం పోయింది. మరో ప్రాణం చావు బతుకుల మధ్య ఉంది.. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే అన్నారు.
అల్లు అర్జున్ను అరెస్టు చేస్తామని హెచ్చరిస్తేనే ధియేటర్ నుంచి వెళ్లాడు. పుష్ప 2 ప్రీమియర్ రోజు అల్లు అర్జున్ కు పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా వచ్చాడు. అదీ కూడా ర్యాలీ చేసుకుంటూ వచ్చాడు. తొక్కిసలాట జరిగిన తర్వాత వెళ్లిపోవాలని పోలీసులు చెప్పారు. అయినా వినలేదు. అరెస్టు చేస్తామని హెచ్చరిస్తేనే వెళ్లిపోయారు. వెళ్లేటప్పుడు కూడా ర్యాలీ చేశారు. సినిమా స్టార్లకు ప్రత్యేక ప్రివిలేజ్ ఉందా.. వారు మర్డర్లు చేసిన విచారణ చేయవద్దా ? అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి.