విచిత్రమైన నిజాలు.. తెలిస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు.. పెన్ క్యాప్ కొరికే అలవాటుందా..?

-

మన చుట్టూ ఉండే కొన్ని క్రేజీ ఫ్యాక్ట్స్ మనకు తెలిసినప్పుడు అవి మనల్ని కచ్చితంగా ఆశ్చర్యానికి గురిచేస్తాయి. మనిషికి ఎన్ని విషయాలు తెలిస్తే.. అంత తెలివైనవాడు అంటారు. ఇలాంటి విషయాలు కానీ మీరు తెలుసుకున్నారంటే.. మీ తెలివితేటలు ఇంకా పెరుగుతాయి. ఇంకెందుకు ఆలస్యం ఈ క్రేజీ నిజాలు గురించి మీరు ఓ లుక్కేయండి.!

1976లో వచ్చిన స్వైన్ ఫ్లూ (swine flu) వల్ల ఒకరు చనిపోయారు. కానీ దానికోసం చేసిన వ్యాక్సిన్ వల్ల 25 మంది మృతి చెందారు.

మీరు బఠాణీ (pea)ని నమలకుండా.. లోపలికి పీల్చితే (inhale) అది ఊపిరితిత్తుల్లో (Lungs) మొలకెత్తి, మొక్క పెరిగే అవకాశం ఉందట. వామ్మో జాగ్రత్తండోయ్..!

గుడ్లు తినే పిల్లలు దొంగలు అవుతారని నైజీరియాలో కొంతమంది బలంగా నమ్ముతారట.

పెన్ క్యాపుల చివర కొరికే అలవాటు ఉన్న విద్యార్థులు ఎక్కువ తెలివైన వారు అవుతారు. వారికి మానసిక సమస్యలు తక్కువగా వస్తాయట.. ఇదైతే చిన్నప్పుడు చాలామందికి ఉండే ఉంటుంది.

టాయిలెట్ సీట్లు విరిగి జరిగే ప్రమాదాలతో ఏటా వేల మంది ఆస్పత్రుల్లోని ఎమర్జెన్సీ వార్డుల్లో చేరుతున్నారట.

మీరు రోజూ 6 గంటలు చొప్పున 3 నెలలపాటూ ధ్యానం చేస్తే… మీలో ఏకాగ్రతా శక్తి విపరీతంగా పెరుగుతుందని అధ్యయనాలు చెప్తున్నాయి.

పనిచేసేటప్పుడు మీకు మీరు మాట్లాడుకుంటూ ఉంటే… దానివల్ల పని త్వరగా అవుతుంది. ఫోకస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది.

రోజూ 20 నిమిషాలు వేగంగా నడిస్తే… త్వరగా చనిపోయే అవకాశాలు 30 శాతం తగ్గుతాయట..

టెక్ట్స్ మెసేజ్ టైప్ చేస్తూ వాహనాలు నడపడం వల్ల అమెరికాలో ఏటా 6వేల మంది దాకా మృత్యువాతపడుతున్నారు.

రోజుకోసారి భావప్రాప్తి అనేది అనారోగ్యాలకు దూరంగా ఉంచుతుందట. ఆయుష్షును 8 ఏళ్లు పెంచుతుందని అధ్యయనాలు తేటతెల్లం చేశాయి.

ఇప్పటివరకూ ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే (Fifty Shades of Grey) అనేది అత్యంత వేగంగా అమ్ముడైన అడల్డ్ నవల. మీరు చదివారా..!

గొప్ప వీరుడు అయిన ఛెంగీస్ ఖాన్ (Ghengis Khan) బెడ్‌పై సెక్స్ చేస్తూ చనిపోయాడట.

మీ ఆలోచనలు ఎంత శక్తిమంతమైనవో మీరు గ్రహిస్తే.. ఇంకెప్పుడూ మీరు నెగెటివ్ థాట్స్ మీ మనసులోకి రానివ్వరు.

కంటిన్యూగా ఎవరైనా కలలోకి వస్తూ ఉంటే.. వాళ్లను మీరు కోల్పోయి ఉంటారు లేదా… వాళ్లు మీ గురించి బాగా ఆలోచిస్తూ ఉండొచ్చు కూడా.

చెవుడు (deaf) ఉన్నవారికి .. ఎక్కడో చిన్నగా వినిపిస్తూనే ఉంటుంది. అదోరకమైన ఇన్నర్ వాయిస్.

స్నానం చేసేటప్పుడు షవర్ ద్వారా బ్యాక్టీరియా రాకూడదు అనుకుంటే… స్నానానికి ముందు షవర్‌ని కొన్ని క్షణాలు ఆన్ చేయాలి.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news