టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ నటనపరంగా ఎంతోమంది అభిమానులను సంపాదించారు.
కృష్ణ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు దర్శకత్వం, నిర్మాతగా కూడా పలు సినిమాలకు వ్యవహరించారు. ఇక కృష్ణ ఈ రోజున ఉదయం నాలుగు గంటలకు మరణించడం జరిగింది. దీంతో కృష్ణకు సంబంధించి పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి. రాజాగా కృష్ణ తల్లిదండ్రులకు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.
సూపర్ స్టార్ కృష్ణ 1943 మే 31వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా బుర్రిపాలెం లో జన్మించారు. కృష్ణ తల్లిదండ్రులు ఘట్టమనేని రాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మకు జన్మించారు. కృష్ణ ఇందిరాదేవి, విజయనిర్మల నటిని వివాహం చేసుకున్నారు. ఇందిరా దేవికి ఐదు మంది పిల్లలు. అందులో ఇద్దరు కుమారులు రమేష్ బాబు, మహేష్ బాబు, ముగ్గురు కూతుర్లు.. అందులో పద్మావతి, మంజుల ,ప్రియదర్శిని అయితే విజయనిర్మలకు కృష్ణకు జన్మించిన పిల్లలు మాత్రం లేరు. కృష్ణ విజయనిర్మల కలసి దాదాపుగా 40 సినిమాలకు పైగా కలిసి నటించారు.
కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి.. అయితే కేవలం కృష్ణ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. కృష్ణ 350 కి పైగా చిత్రాలలో నటించారు. 2009లో పద్మ భూషణ్ తో భారత ప్రభుత్వం సత్కరించింది. ఇక 1989లో కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు సభ్యుడుగా కూడా ఎన్నికయ్యారు.
సినీ ఇండస్ట్రీలో మొదట 70mm చిత్రాన్ని పరిచయం చేసింది కృష్ణ గారే. సరికొత్త టెక్నాలజీని కూడా పరిచయం చేసింది కృష్ణ గారే అని చెప్పవచ్చు. ఇలా సినీ పరిశ్రమకు ఎంతో సేవ చేసిన కృష్ణ గారు ఈ రోజున ఉదయం తుది శ్వాస విరచడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఈ విషయాన్ని అటు అభిమానులు సినీ ప్రేక్షకులు కృష్ణ కుటుంబం జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం కృష్ణ కుటుంబానికి సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.