దేశంలో జనాబా పెరగడం వలన దేశానికి వచ్చిన ప్రయోజనాలు ఏమి ఉన్నాయో ఏమో తెలియదు గాని జనాబా పెరగడం వలన మాత్రం కొన్ని కొన్ని నష్టాలు తీవ్రంగా ఉన్నాయి. మనుషుల సంఖ్య పెరగడం మనుషులకు ఇబ్బందిగా ఉందో లేదో తెలియదు గాని పశు పక్ష్యాధులకు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. పాపం అవి ఆడుకోవడానికి కూడా బయటకు వచ్చే పరిస్థితి ఎక్కడా లేదు. అటవీ ప్రాంతాల్లో కూడా అవి బయట తిరగలేని పరిస్థితి.
వాటి వాటి స్థలాల్లో కూడా అవి తిరగలేక ఇబ్బంది పడుతున్నాయి. ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ జనతా కర్ఫ్యూ కి పిలుపునిచ్చారు. ఈ పిలుపుతో ప్రజలు ఎవరూ కూడా రోడ్ల మీదకు రాలేదు. దీనితో బంజారా హిల్స్ కేబిఆర్ పార్క్ వద్ద నెమళ్ళు రోడ్డు మీదకు గింజలు తింటున్నాయి. మనుషులు ఎవరూ లేకపోవడంతో నిర్మానుష్యంగా ఉన్నాయి రోడ్లు. ఇన్నాళ్ళు ప్రజలకు భయపడి రోడ్ల మీదకు రాలేదు అవి.
ఇప్పుడు హాయిగా స్వేచ్చగా తిరుగుతున్నాయి కొండ మీద నుంచి, పార్క్ లో నుంచి బయటకు వచ్చి. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తో అది వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృత౦గా తిరుగుతుంది. పాపం ఒక్క రోజు అవి స్వేచ్చగా అలా తిరగడం చూసి అందరూ హర్షం వ్యక్తం చేస్తూ మనం వాటిని ఇంత ఇబ్బంది పెడుతున్నామా అని అంటున్నారు.