పిల్లలకి ఏది మంచి ఏది చెడు అనే దానిని తల్లిదండ్రులే నేర్పాలి. ఒకవేళ కనుక పిల్లలకి మంచి ఏది చెడు ఏది అని తెలియక పోతే అది తల్లిదండ్రులు తప్పే. ముఖ్యంగా ఆడపిల్లలకి తల్లిదండ్రులు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పాలి. చాలామంది తల్లిదండ్రులు ఇటువంటి విషయాలను అసలు ఆడపిల్లలకి చెప్పరు. అయితే ఎలా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి పిల్లలకు చెప్పాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.
దీనికోసం పిల్లలకి తల్లిదండ్రులు చిన్న చిన్న సంఘటనలు తీసుకుని కథల రూపంగా చెప్తే మంచిది. ఏ విధంగా బ్యాడ్ టచ్ ఉంటుంది ఏ విధంగా గుడ్ టచ్ ఉంటుంది అనేది కల్పితంగా చెప్తే వాళ్ళు తెలుసుకుంటారు. అలానే పిల్లలకి ఎలా ప్రవర్తిస్తే ఇబ్బందిగా ఉంటుంది అభ్యంతరకరమైన పనులు చేయడం, ప్రవర్తించడం లాంటివన్నీ కూడా వాళ్లకి అర్థమయ్యేటట్లుగా తల్లిదండ్రులు చెప్తూ ఉండాలి.
పైగా మనకి తెలిసిన వాళ్ళు కూడా తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటారు అందర్నీ నమ్మకూడదు అనే విషయాలను కూడా వారికి చెప్పాలి. అయితే మీరు ఇటువంటివి నేర్పేటప్పుడు వాళ్లు భయంకరంగా ఫీల్ అవ్వకూడదు. భయపడకూడదు. కేవలం చిన్న చిన్న పదాలు చిన్న చిన్న మాటల ద్వారా చెప్పాలి. అప్పుడు పిల్లలు కచ్చితంగా అర్థం చేసుకుంటూ ఉంటారు.
గుడ్ టచ్ వల్ల ఇబ్బంది ఉండదు. అలానే అభ్యంతరకరమైన పనులు చేయరు ప్రవర్తించరు అందరి ముందే చక్కగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇవన్ని కూడా పిల్లలకి తల్లిదండ్రులే చెప్పుకోవాలి. ఒకవేళ కనుక పిల్లలకి నచ్చని పనులు చేయడం, అభ్యంతరకరమైన పనులు చేయడం ఇలాంటివి జరిగితే తల్లిదండ్రులకి చెప్పుకోవాలి అని తల్లిదండ్రులు నేర్పాలి.