ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌కు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అందిస్తున్న వ‌డ్డీ రేట్ల వివ‌రాలు..

-

ప్ర‌ముఖ ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ ఫిక్స్‌డ్ డిపాజిట్‌(ఎఫ్‌డీ)ల‌కు ఇస్తున్న వ‌డ్డీ రేట్ల‌పై కోత విధించింది. 91 రోజుల నుంచి 6 నెల‌ల వ్య‌వ‌ధితోపాటు 2 ఏళ్ల నుంచి 5 ఏళ్ల కాల ప‌రిమితి క‌లిగిన ఎఫ్‌డీల‌కు ఇస్తున్న వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గిస్తున్న‌ట్లు తెలిపింది. కాగా త‌గ్గించిన వ‌డ్డీ రేట్లు ఇప్ప‌టికే అమ‌లులోకి వ‌చ్చాయి. ఇక స‌వ‌రించిన వ‌డ్డీ రేట్ల ప్ర‌కారం ఆయా మొత్తాల‌కు గాను నిర్ణీత కాల వ్య‌వ‌ధికి ఇస్తున్న వ‌డ్డీ రేట్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

hdfc bank fixed deposits interest rates

రూ.2 కోట్ల క‌న్నా త‌క్కువ మొత్తంలో ఎఫ్‌డీల‌కు ఇస్తున్న వ‌డ్డీ రేట్ల వివ‌రాలు

* 7 నుంచి 29 రోజుల‌కు – 2.5 నుంచి 3.00 శాతం
* 30 నుంచి 90 రోజుల‌కు – 3 నుంచి 3.50 శాతం
* 91 నుంచి 6 నెల‌ల‌కు – 3.50 నుంచి 4.00 శాతం
* 6 నెల‌ల 1 రోజు నుంచి ఏడాది లోపు – 4.40 నుంచి 4.90 శాతం
* 1 నుంచి 2 ఏళ్ల వ‌ర‌కు – 5.10 నుంచి 5.60 శాతం వ‌ర‌కు
* 2 ఏళ్ల 1 రోజు నుంచి 3 ఏళ్ల వ‌ర‌కు – 5.15 నుంచి 5.65 శాతం వ‌ర‌కు
* 3 ఏళ్ల 1 రోజు నుంచి 5 ఏళ్ల వ‌ర‌కు – 5.30 శాతం నుంచి 5.80 వ‌ర‌కు
* 5 ఏళ్ల 1 రోజు నుంచి 10 ఏళ్ల వ‌ర‌కు – 5.50 శాతం నుంచి 6.25 వ‌రకు

రూ.5 కోట్ల క‌న్నా త‌క్కువ మొత్తంలో చేసే ఎఫ్‌డీల‌కు ఇస్తున్న వ‌డ్డీ రేట్ల వివ‌రాలు

* 7 నుంచి 29 రోజుల‌కు – 2.5 నుంచి 3.00 శాతం
* 30 నుంచి 60 రోజుల‌కు – 2.75 నుంచి 3.25 శాతం
* 61 నుంచి 6 నెల‌ల‌కు – 3.00 నుంచి 3.50 శాతం
* 6 నెల‌ల 9 నెల‌ల వర‌కు – 3.50 నుంచి 4.00 శాతం
* 9 నెల‌ల నుంచి 1 ఏడాది వ‌ర‌కు – 3.75 నుంచి 4.25 శాతం వ‌ర‌కు
* 1 నుంచి 2 ఏళ్ల వ‌ర‌కు – 4.00 నుంచి 4.50 శాతం వ‌ర‌కు
* 2 ఏళ్ల 1 రోజు నుంచి 5 ఏళ్ల వ‌ర‌కు – 4.25 నుంచి 4.75 శాతం వ‌ర‌కు
* 5 ఏళ్ల 1 రోజు నుంచి 10 ఏళ్ల వ‌ర‌కు – 4.25 శాతం నుంచి 5.00 వ‌రకు

ఇక 5 ఏళ్ల 1 రోజు నుంచి 10 ఏళ్ల వ‌ర‌కు రూ.5 కోట్ల క‌న్నా త‌క్కువ మొత్తాన్ని ఎఫ్‌డీ చేస్తే సీనియర్ సిటిజెన్ల‌కు 0.25 శాతం అద‌న‌పు వ‌డ్డీ చెల్లిస్తారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్పెష‌ల్ డిపాజిట్ ఆఫ‌ర్ కింద ఈ అవ‌కాశం అందిస్తున్నారు. ఈ ఆఫ‌ర్ సెప్టెంబ‌ర్ 30వ తేదీ వ‌ర‌కు అందుబాటులో ఉంటుంది. అయితే అప్ప‌టి వ‌ర‌కు సీనియ‌ర్ సిటిజెన్లు కొత్త‌గా చేసే ఎఫ్‌డీల‌తోపాటు పాత వాటిని రెన్యువ‌ల్ చేసుకున్నా ఈ ఆఫ‌ర్ కింద అద‌న‌పు వ‌డ్డీని చెల్లిస్తారు. ఇక ఈ ఆఫ‌ర్ ఎన్ఆర్ఐల‌కు అందుబాటులో లేదు.

Read more RELATED
Recommended to you

Latest news