నిరుద్యోగులకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గుడ్ న్యూస్..!

-

దేశీ దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తీపికబురు అందించింది. తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నిరుద్యోగులకు రిలీఫ్ ని ఇచ్చే ప్రకటన ఒకటి చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంక్ నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేస్తామని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తెలియజేయడం జరిగింది. అయితే దీని కోసం కొత్తగా నియామకాలు చేపడతామని పేర్కొంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

hdfc bank
hdfc-bank

గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంక్ నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేస్తామని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అంది. అలానే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బ్యాంక్ బ్రాంచ్, బిజినెస్ కరస్పాండెట్స్, బిజినెస్ ఫెసిలిటేటర్స్, కామన్ సర్వీస్ సెంటర్ పార్ట్‌నర్స్, వర్చువల్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్, డిజిటల్ ఔట్రీచ్ ప్లాట్‌ ఫామ్స్ వంటి వాటి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మరెంత చేరువ అవుతామని అంది. వచ్చే 18 నుంచి 24 నెలల కాలం లో 2 లక్షల గ్రామాలకు చేరువ అవుతామని బ్యాంక్ తెలిపింది.

అయితే దీని కోసం వచ్చే ఆరు నెలల కాలం లో కొత్తగా 2,500 మందికి నియమించుకుంటామని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్ కూడా గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటు లో ఉండాలని చెప్పిన సంగతి తెలిసిందే. అందు కోసమే బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news