కోమటిరెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే తెలీదు – రేణుకా చౌదరి

-

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదని అన్నారు రేణుక చౌదరి. అసలు సీఎల్పీ కి ఆదేశాలు ఇవ్వడానికి కోమటిరెడ్డి ఎవరిని ప్రశ్నించారు. భట్టి విక్రమార్క పాదయాత్రకు ఎవరిని పిలిచారో ఆయననే అడగాలన్నారు రేణుక చౌదరి. అసలు పాదయాత్రలకు పిలవడం ఏంటని..? ఇదేమైనా ఇంట్లో పేరంటమా అని ఎద్దేవా చేశారు. పార్టీ కోసం పనిచేయాలి అనుకుంటే పాల్గొనాలని సూచించారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెంటే తామంతా ఉన్నామని స్పష్టం చేశారు. పాదయాత్రలు అందరూ చేయాలని.. పోటీ యాత్రలు లేవని అన్నారు. మహేశ్వర్ రెడ్డిని.. థాక్రే కారణం లేకుండా ఆపమని అనరని.. ఏదో కారణం ఉంటేనే ఆపమంటారని అన్నారు. ఇక భట్టి విక్రమార్క పాదయాత్ర ఖమ్మంలో ముగుస్తుంది అన్నారు రేణుక చౌదరి.

Read more RELATED
Recommended to you

Latest news