మన శరీరంలో తల భాగం చాలా సెన్సిటివ్.. తలనొప్పి చాలామంది లైట్ తీసుకుంటారు..ఇది దీర్ఘకాలం ఉంటుందంటే.. మీ తలలో ఏదో ఒక సమస్య ఉన్నట్లే..తలకు ఆయిల్ పెట్టడం, హెడ్‌బాత్ చేయడం ఇవన్నీ రెగ్యులర్‌గా ఒక క్రమపద్దతిలో చేయాలి. చాలామంది.. నైట్ టైమ్ తలస్నానం చేసి.. అలా తడిజుట్టుతోనే పడుకుంటారు. హెయిర్‌ను బెడ్‌కు పక్కకు వేస్తే.. అదే ఆరుతుందిలే అని.. తలస్నానం చేసి..ఆ తడితలతో పడుకుంటే.. భలే నిద్రపడుతుంది..కానీ ఇలా చేయడం వల్ల చాలా ప్రమాదం అని మీకు తెలుసా..?
ఒత్తిడితో కూడిన రోజు తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి ఉత్తమ మార్గం రాత్రిపూట స్నానం. స్నానంతో శరీర ఉష్ణోగ్రతలో మార్పు వస్తుంది. హాయిగా అనిపిస్తుంది. త్వరగా నిద్రపోవడంలో సహాయపడుతుంది. తడి జుట్టుతో నిద్రపోవడం వల్ల మరుసటి రోజు ఉదయం జలుబు వచ్చే అవకాశాలు పెరుగుతాయని మాత్రమే చాలా మంది అనుకుంటారు. కానీ.. తడి జుట్టుతో పడుకోవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు, జుట్టు చిట్లడం వల్ల వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి మీరు మీ జుట్టును పూర్తిగా పొడిగా ఉంచుకుని పడుకోవాలి. తడి వెంట్రుకలతో పడుకోవడం వల్ల జలుబు వస్తుందనే నమ్మకానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఒకరికి జలుబు వస్తే అది వైరస్ సోకిన కారణంగా వస్తుంది
వైరస్ మీ ముక్కు, నోరు లేదా కళ్ళ ద్వారా మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది. వైరస్ సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు లేదా మాట్లాడినప్పుడు గాలిలోని చుక్కల ద్వారా వ్యాపిస్తుంది. మీరు కలుషితమైన ఉపరితలాన్ని తాకడం ద్వారా లేదా సోకిన వ్యక్తిని చేతితో ముట్టుకోవడం ద్వారా కూడా రావొచ్చు. తడి జుట్టుతో నిద్రించడం ద్వారా మీకు వైరస్ వచ్చే అవకాశం లేకపోలేదు.
తడి జుట్టుతో నిద్రించడం వల్ల కొంత ప్రమాదం ఉంది. తడిగా ఉన్నప్పుడు జుట్టు చాలా బలహీనంగా ఉంటుంది. కాబట్టి నిద్రలో అటు ఇటు తిరిగినప్పుడు.., జుట్టు చిట్లడంలాంటివి జరగొచ్చు. మీరు తడి జుట్టుతో నిద్రిస్తున్నప్పుడు మీకు చుండ్రు లేదా చర్మశోథ వచ్చే అవకాశం ఉంది. మలాసెజియా వంటి శిలీంధ్రాలు ఈ పరిస్థితులకు కారణమవుతాయి
దిండ్లు మీద సహజంగానే..వైరస్ ఉంటుంది.. మీ నెత్తిమీద సహజంగా ఉండే ఫంగస్‌తో పాటు, ఫంగస్‌కు బ్రీడింగ్ గ్రౌండ్‌గా ఉపయోగపడతాయి. అందుకే పడుకునేముందు స్నానం చేస్తే.. కండీషనర్ ఉపయోగించండి. తలస్నానం చేసే ముందు మీ జుట్టుకు కొబ్బరి నూనె రాయండి. జుట్టును వీలైనంత వరకు పొడిగా ఉంచడి, విడదీయండి. తడి వెంట్రుకలతో ఫంగల్ ఇన్ఫెక్షన్లు, జుట్టు విరిగిపోవడమే కాకుండా గొంతు నొప్పి, మొటిమలు, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లకు కూడా కారణం కావచ్చు. పడుకునే ముందు మీ జుట్టు పొడిగానే ఉంచుకోండి.