ఒంటివేలు అంత బరువును ఎలా ఎత్త గలిగాడో తెలుసా?

-

బరువైన వస్తువులను ఎత్తాలంటే మనుషులు రెండు చేతులను ఉపయోగించాలి..ఒక్క వేలుతో భారీగా బరువులను ఎత్తడం ఎప్పుడైనా చూశారా..కనీసం ఎప్పుడైనా విన్నారా..లేదు కధూ ఇప్పుడు ఓ వ్యక్తి మ్యాజిక్ చేసినట్లే ఒక్క వేలుతో బరువులను ఎత్తి రికార్దును సృష్టించాడు.. ఏంటీ.. నిజమా..అసలు అతను మనిషేనా అని డౌట్ వస్తుంది కదూ..కానీ ఇది నిజం అండీ.. అతను అలా ఎత్తి ప్రపంచ రికార్డులను బ్రేక్ చేసాడు.129.5 కిలోల బరువును ఎత్తే ప్రయత్నంలో గర్వపడతాడు. అయితే కేవలం ఒక వేలితో ఆ స్థాయిలో బరువును ఎత్తడం సాధ్యం కాదు..

యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన స్టీవ్ కీలర్ ఆ ఖచ్చితమైన ఫీట్‌ను సాధించాడు. ప్రొఫెషనల్ మార్షల్ఆర్ట్ లో నైపుణ్యం కలిగిన స్టీవ్ అనే వ్యక్తి సింగిల్ వేలితో భారీ బరువును ఎత్తి పది సంవత్సరాలపాటు ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.2022 ఫిబ్రవరి నెలలో కెంట్‌లోని యాష్‌ఫోర్డ్‌లో స్టీవ్ కిలర్ ఈ ఫీట్‌ను ప్రయత్నించాడు. తన కుడి చేతి మధ్య వేలితో 129.5 కిలోల బరువును ఎత్తగలిగాడు. ఈ రికార్డును గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అధికారికంగా ఆమోదించింది. దాని గురించి వారి అధికారిక వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది. కీలర్ 129.5 కిలోల బరువులో ఆరు ఐరన్ డిస్క్‌లు ఉన్నాయి. ఒకటి 10 కిలోల బరువు, ఒకటి 20 కిలోల బరువు, మూడు ఒక్కొక్కటి 25 కిలోల బరువు, ఒకటి 26 కిలోల కంటే కొంచెం ఎక్కువ బరువు ఉంటుంది. కీలర్‌ ధాటికి 2012లో అర్మేనియాకు చెందిన బెనిక్‌ అనే యువకుడు ఒంటి వేలితో పైకెత్తిన 121.69 కిలోల రికార్డు ఇతని రికార్డు తుడిచి పెట్టుకుపోయింది.

భారీ స్థాయిలో బరువు మోయడం అంటే అంతఈజీ కాదని, బరువు మోసే సమయంలో తీవ్రమైన నొప్పి ఉంటుందని తెలిపాడు. కానీ నా వేళ్లు బలంగా ఉండటం వల్ల తాను 129.5 కిలోల బరువును ఎత్తగలిగానని తెలిపాడు.కీలర్ వయస్సు 48 సంవత్సరాలు. గత నాలుగు సంవత్సరాలుగా బలాన్ని పెంచుకొనేందుకు శిక్షణను తీసుకుంటున్నాడు. కీలర్ 18 సంవత్సరాల వయస్సు నుండి జూడో, కరాటే రెండింటిలోనూ శిక్షణ పొందిఉన్నాడు. ప్రపంచ రికార్డును సాధించడానికి ప్రయత్నించినప్పుడు అది అతనికి చాలా ఉపయోగపడింది.అతను తనకు వచ్చిన రికార్డును తన చిన్నాన్నకు ఇచ్చారు.. ప్రస్తుతం ఇతనికి సంభందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news