టాలీవుడ్ లో అత్యధికంగా పారితోషకం తీసుకుంటున్న డైరెక్టర్ ఈయనే..!

-

గతంలో అయితే దర్శకులు హీరోల తర్వాత ఆ రేంజ్ లో పారితోషకం అందుకునేవారు. కానీ కాలం మారుతున్న కొద్దీ సినిమాలకు వస్తున్న లాభాలను చూసి దర్శకులు కూడా లాభాలలో వాటాలు కోరుతున్నారు. పారితోషకంతో పాటు వచ్చిన లాభాల్లో వాటా అందుకుంటూ మరింతగా పారితోషకం పొందుతున్నారు.ఇక ఈ క్రమంలోని టాలీవుడ్ లో అధికంగా పారితోషకం తీసుకుంటున్న డైరెక్టర్ల గురించి ఇప్పుడు చూద్దాం.

రాజమౌళి:
టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఒక్క పరాజయం కూడా లేకుండా.. దర్శకత్వం వహించిన ప్రతి సినిమాతోనూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాజమౌళి పాన్ ఇండియా రేంజ్ లో మాత్రమే కాదు ఇంటర్నేషనల్ గా తన పేరును పదిలం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక్కొక్క సినిమాకు రూ. 30 కోట్ల పారితోషకంతో పాటు లాభాల్లో వాటా కూడా తీసుకుంటున్నట్లు సమాచారం.

సుకుమార్:
క్రియేటివ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్ రంగస్థలం సినిమా తర్వాత తన పారిపోషకం పెంచినట్లు సమాచారం. ఇలా ఉంటే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పుష్ప 2 కోసం రూ.23 కోట్ల పారితోషకంతో పాటు లాభాల్లో వాటా తీసుకోబోతున్నట్లు సమాచారం.

కొరటాల శివ:
ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న సినిమా కోసం కొరటాల శివ రూ.20 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం.

బోయపాటి శ్రీను:
టాలీవుడ్ లో మాస్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఒక్కో సినిమాకు రూ. 10 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నారు.

పూరీ జగన్నాథ్:
డేరింగ్ అండ్ డాన్సింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ ఇటీవల లైగర్ సినిమాతో డిజాస్టర్ ను చవిచూసిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈయన ఒక్కో సినిమాకు రూ.పదికోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news