జస్ట్ 1.8 శాతం ఓట్ల తేడాతో గట్టెక్కారు: కేసీఆర్

-

అధికారంలోకి వచ్చి నాలుగో నెల గడుస్తున్నా రుణ మాఫీపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.’డిసెంబర్ 9 ఎప్పుడు పోయింది. ముఖ్యమంత్రి రేవంత్ ఎక్కడ పడుకున్నారు. జనాలకు ఇష్టమొచ్చిన సొల్లు పురాణాలు చెప్పి జస్ట్ 1.8శాతం ఓట్ల తేడాతో గట్టెక్కి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు అని అన్నారు. మిమ్మల్ని నిద్రపోనివ్వం. తరిమి కొడతాం’ అని వార్నింగ్ ఇచ్చారు.

అద్భుతమైన తెలంగాణ వంద రోజుల్లోనే ఇలా అవుతుందని అనుకోలేదని కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు . ‘చాలా దు:ఖంతో మాట్లాడుతున్నా. ఇంత తక్కువ సమయంలో రైతులకు ఇంత కష్టకాలం వస్తుందని మేం అనుకోలేదు అని మండిపడ్డారు. లక్షల ఎకరాల పంటలు ఎందుకు ఎండిపోతున్నాయి. దేశంలోనే నం.1 రాష్ట్రానికి ఎందుకు చెదలుపట్టింది? పంటలు ఎండుతుంటే మంత్రులు కనీసం సమీక్ష కూడా చేయలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంకు ఢిల్లీ వెళ్లడమే సరిపోతోంది’ అని కేసిఆర్ ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news